డీఆర్వో, ఒంగోలు ఆర్డీవో బదిలీ
ABN , Publish Date - May 02 , 2026 | 03:17 AM
జిల్లాలో పనిచేస్తున్న పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న బి.చినఓబులేశును కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్డీవోగా బదిలీ చేసింది.
ఒంగోలు ఆర్డీవోగా చంద్రశేఖర్‌నాయుడు నియామకం
ఒంగోలు కల్టెరేట్, మే 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పనిచేస్తున్న పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న బి.చినఓబులేశును కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్డీవోగా బదిలీ చేసింది. ఒంగోలు ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్నను మునిసిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎస్‌డీసీ)గా నియమించింది. చీరాల ఆర్డీవోగా పనిచేస్తున్న తూమాటి చంద్రశేఖర్‌నాయుడుకు ఒంగోలు ఆర్డీవోగా స్థానచలనం కల్పించింది. కనిగిరి ఆర్డీవోగా టి.అజయ్‌కుమార్‌ను నియమించింది. ఒంగోలు (ఆర్డీవో)గా నియమితులైన తూమాటి చంద్రశేఖర్ నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన వారు. 2005లో తహసీల్దార్‌గా ఉద్యోగంలో చేరారు. చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన ఆయన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగోన్నతి పొందారు. చిత్తూరులో ఫారెస్టు సెటిల్‌మెంట్ ఆఫీసర్‌తోపాటు తిరుపతి ప్రొటోకాల్ విభాగం అధికారిగా పనిచేశారు. తిరుపతి నుంచి చీరాల ఆర్డీవోగా బదిలీపై వచ్చారు. ప్రస్తుతం ఆయన ఒంగోలు ఆర్డీవోగా నియమితులయ్యారు. త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
మొదటి పోస్టింగ్‌లోనే గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీప్రసన్న
ఒంగోలు ఆర్డీవోగా లక్ష్మీప్రసన్న 17నెలలపాటు పనిచేశారు. 2024 అక్టోబరు 5న బాధ్యతలు చేపట్టిన ఆమెకు ఆర్డీవోగా మొదటి పోస్టింగ్. శిక్షణ ముగిసిన వెంటనే ఆమెను ఒంగోలు ఆర్డీవోగా నియమించగా పలు అంశాల్లో గుర్తింపు పొందారు. మొంథా తుఫాన్ సమయంలో ఒంగోలు డివిజన్ పరిధిలో విస్తృదంగా పర్యటించడమే కాకుండా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా పనిచేసినందుకు గవర్నర్ చేతులమీదుగా అవార్డును కూడా అందుకున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో మ్యాపింగ్‌కు ఎన్నికల కమిషన్ చేతులమీదుగా అవార్డును కూడా పొందారు