Share News

డ్రైవింగ్‌ పరీక్ష కఠినతరం

ABN , Publish Date - Feb 28 , 2026 | 01:55 AM

రహదారి భద్రత, లైసెన్స్‌ల జారీలో పారదర్శకత పెంచడం లక్ష్యంగా డ్రైవింగ్‌ పరీక్షలను కఠినతరం చేయను న్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రాష్ట్రప్రభుత్యం ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఒంగోలు, ఏలూరు, విజయన గరం, అనకాపల్లిలో ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెస్టు ట్రాక్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

డ్రైవింగ్‌  పరీక్ష కఠినతరం

ఒంగోలులో ఆటోమేటెడ్‌ టెస్ట్‌ ట్రాక్‌

నైపుణ్యం ఉన్న వారికే లైసెన్స్‌

రోడ్డు భద్రత లక్ష్యంగా ముందుకు

ట్రాక్‌పై సెన్సార్లు, సీసీ కెమెరాలు

ఒంగోలు క్రైం, ఫిబ్రవరి 27 (ఆంధ్ర జ్యోతి) : రహదారి భద్రత, లైసెన్స్‌ల జారీలో పారదర్శకత పెంచడం లక్ష్యంగా డ్రైవింగ్‌ పరీక్షలను కఠినతరం చేయను న్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రాష్ట్రప్రభుత్యం ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఒంగోలు, ఏలూరు, విజయన గరం, అనకాపల్లిలో ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెస్టు ట్రాక్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందుకోసం మారుతీ సుజుకీ ఇండియాతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. పదిరోజుల క్రితం మారుతీ సుజుకీ కంపెనీ ప్రతినిధులు ఒంగోలులోని ఆర్టీవో కార్యాలయ ఆవరణను పరిశీలించారు. పనులు ప్రారంభిస్తే ట్రాక్‌ పూర్తికావడానికి రెండు నుంచి మూడు నెలలు పడుతుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. డ్రైవింగ్‌ టెస్టు పూర్తిగా సెన్సార్లు, సీసీ కెమెరాల ఆధారంగా జరుగుతుంది. ఫలితం డిజిటల్‌ కంప్యూటర్‌ ద్వారా వస్తుంది. ఎలాంటి చిన్న తప్పు చేసినా టెస్టు పాస్‌ అయ్యే పరిస్థితి ఉండదు. ఒంగోలులో ఏర్పాటు చేయనున్న డ్రైవింగ్‌ టెస్టు ట్రాక్‌లో ద్విచక్రవాహనాలు, కారు, హెవీ మోటార్‌ వాహనాలు, ఆటోలకు సంబంధించిన డ్రైవింగ్‌ పరీక్షలు జరుగుతాయి.ఈ ప్రాజెక్టు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు కానుంది. రవాణా శాఖ తరఫున ట్రాక్‌ ఏర్పాటుకు అవసరమైన స్థలం, సివిల్‌ పనులు, విద్యుత్‌ సౌకర్యం సమకూరుస్తారు. సుజుకీ కంపెనీ సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషియల్‌ రెస్పాన్స్‌బులిటీ) ట్రాక్‌ల రూపకల్పన, అత్యాధునిక సెన్సారు,్ల కెమెరాలు ఏర్పాటు, సాప్ట్‌వేర్‌ నిర్వహణ భాధ్యతలు చూస్తుంది. ఆ మేరకు ఆ కంపెనీతో రవాణా శాఖ ఈనెల 3న అమరావతిలో ఒప్పందం చేసుకుంది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా కంపెనీ ఆటోమెటేడ్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌, రవాణ శాఖతో కలిసి ఏర్పాటు చేస్తుంది. మూడేళ్ల పాటు నిర్వహణ బాధ్యత సుజుకీ కంపెనీ చూస్తుంది.

Updated Date - Feb 28 , 2026 | 01:55 AM