ప్రభుత్వ వైద్యశాలల విభజన
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:41 AM
ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలను విభజించారు. గతనెల 31వతేదీన మార్కాపురం జిల్లా ఏర్పాటు కావడంతో రెండు జిల్లాల పరిధిలో ఉన్న ప్రభుత్వ వైద్యశా లలను ఆయా జిల్లాలకు కేటాయించారు. ప్రకాశంలో 61 వైద్యశాలలు ఉండగా మార్కాపురం జిల్లాలో 53 ఉన్నాయి.
ప్రకాశం జిల్లాలో 61, మార్కాపురంలో 53
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలను విభజించారు. గతనెల 31వతేదీన మార్కాపురం జిల్లా ఏర్పాటు కావడంతో రెండు జిల్లాల పరిధిలో ఉన్న ప్రభుత్వ వైద్యశా లలను ఆయా జిల్లాలకు కేటాయించారు. ప్రకాశంలో 61 వైద్యశాలలు ఉండగా మార్కాపురం జిల్లాలో 53 ఉన్నాయి. మార్కాపురం జిల్లాకు అక్కడి అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారికి డీఎంహెచ్‌వోగా బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు కొనసాగుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల విభజనను పార్లమెంట్ స్థానం పరిధిలో విభజన చేయగా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాకేంద్రం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. మార్కాపురం జిల్లాలో కనిగిరి, మార్కాపురం, వైపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలతో ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు, కొండపి, ఎస్‌ఎన్‌పాడు, దర్శి నియోజకవర్గాలతోపాటు నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు, బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని కలిపారు. ప్రస్తుతం కందుకూరు, అద్దంకి నియోజకవర్గాల్లో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలు కూడా ఇప్పుడు ప్రకాశంలోకి వచ్చాయి.