రాజముద్రతో పాసుపుస్తకాల పంపిణీ
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:19 AM
ప్రభుత్వం రాజముద్రతో ప్రచురిం చిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది.
దేవరపల్లి(పర్చూరు), జనవరి 8 (ఆంధ్ర జ్యోతి) : ప్రభుత్వం రాజముద్రతో ప్రచురిం చిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పర్చూరు మండలంలోని దేవరపల్లి గ్రామంలో తహసీల్దార్ బ్రహ్మయ్య, డిప్యూటీ తహశీల్ధార్ పాలపర్తి సుధారాణి ఆధ్వర్యంలో రైతులకు పాసుపుస్తకాలను అందజేశారు. ఈసందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో సాంకేతిక సమస్యల నేపథ్యంలో భూమి ఉండి కూడా పాసుపుస్తకాలు లేక బ్యాంకుల్లో రుణాలు పొందలేక రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీన్ని అధిగ మంచి ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాస్‌పుస్తకాలను అందిం చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో రైతులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
మార్టూరు :ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను గురువారం మార్టూరులోని 1వ గ్రామ సచివాలయం వద్ద రైతులకు పంపిణీ చేశారు. ఈ సచివాలయం పరిధిలోని కొంతమంది రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. మిగిలిన రైతులకు కూడా పాస్ పుస్తకాలు వచ్చాయని వాటిని రైతులకు అందజేస్తామని వీఆర్‌వో మీనా తెలిపారు. టీడీపీ నాయకులు తొండెపు ఆదినారాయణ, మాజీ ఉపసర్పంచ్ కమ్మ శి వనాగేశ్వరరావు, వీఆర్‌వో మోహన్‌ల చేతుల మీదగా పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అదేవిదంగా మండల పరిధిలోని కోలలపూడి గ్రామంలో రైతులకు పాసుపుస్తకాలను పంపి ణీ చేశారు. కార్యక్రమంలో తాటి నాగేశ్వర రావు, సొసైటీ అధ్యక్షులు తాటి నాగార్జున, సర్పంచ్ ఎం సతీష్‌కుమార్, కందిమళ్ల కొండల రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
పాసుపుస్తకాల పంపిణీ
ఇంకొల్లు : ఇంకొల్లు మండలం భీమవరం, కొణికి, నాగండ్ల రీసర్వే జరిగిన గ్రామాల్లో తహసీల్దార్ ఏవీఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏఎంసీ ఛైర్మన్ గుంజి వెంకట్రావు, మండల పార్టీ అధ్యక్షులు నాయుడు హను మంతరావు చేతుల మీదుగా గురువారం పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారం భించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లా డుతూ మాట్లాడుతూ మండలం మొత్తం మీద 2812 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్య క్రమంలో రెవెన్యూ సిబ్బది, విలేజ్ సర్వేయర్లు, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
చినగంజాం : భూ సంబంఽధిత సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు అన్నారు. మండలంలోని కడవకుదురు, గొనసపూడి, చింతగుంపల్లె గ్రామాల్లో గురువారం ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ పంపిణీ చేశారు. రైతులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ నూతన పాసు పుస్తకాలను ప్రభుత్వం సాధికారికంగా అందిస్తోందని తహసీల్దార్ అన్నారు. కార్యక్ర మంలో డిపూటీ తహసీల్దార్ సుజాత, ఆర్‌ఐ బండారు దానియేలు, ఆయా గ్రామాల గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు.