చిన్నారులకు కృత్రిమ అవయవాల పంపిణీ
ABN , Publish Date - Aug 20 , 2026 | 10:59 PM
బాల భవిత కేంద్రంలోని చిన్నారులకు కృత్రిమ అవయాలను గురువారం జీజీహెచ్‌లో జేసీ కల్పనాకుమారి అందజేశారు.
ఒంగోలు కార్పొరేషన్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : బాల భవిత కేంద్రంలోని చిన్నారులకు కృత్రిమ అవయాలను గురువారం జీజీహెచ్‌లో జేసీ కల్పనాకుమారి అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బెంగళూరుకు చెందిన ఒమేగా రిహాబిటేషన్ ఫౌండేషన్ సహకారంతో చిన్నారులకు ఆర్థోటిక్, ప్రాస్టటిక్స్, వీల్ చైర్లు, ట్రై సైకిళ్లను జేసి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగ చిన్నారులకు ప్రభుత్వం నుంచి మరింత సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అలాగే మానసిక వైకల్యం కలిగిన వారికి, గుండెజబ్బులు కలిగిన చిన్నారులకు వైద్యం అందించాలని జీజీహెచ్ అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంగవైకల్యం కలిగిన చిన్నారులకు పెన్షన్లు మంజూరు చేయడానికి అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సలు అందించడానికి వైద్య ఆరోగ్య శాఖ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. భగీరధి మాట్లాడుతూ ఒమేగా రిహాబిటేషన్ ఫౌండేషన్ ముందుకొచ్చి కృత్రిమ పరికరాలు అందించడం అభినందనీయయన్నారు. సుమారు రూ.8లక్షల వ్యయంతో కూడిన వివిధ పరికరాలు అందించారని చెప్పారు. అలాగే గ్రామాలలో కూడా క్యాంపులు నిర్వహించి, దివ్యాంగ చిన్నారులను గుర్తించి పరికరాలు అందేలా సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో దివ్యాంగుల శాఖ ఏడీ సువార్త, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. మాణిక్యరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, ఆర్‌ఎంవో డాక్టర్ మాధవీలత,డాక్టర్ తిరుపతిరెడ్డి, బాషా, ఏడుకొండలతోపాటు ఫిజియోథెరపిస్ట్ సునీత పాల్గొన్నారు.