నేడు పంచాయతీల్లో ఓటర్ల జాబితాల ప్రదర్శన
ABN , Publish Date - Apr 15 , 2026 | 03:00 AM
ల్లాలోని గ్రామ పంచా యతీల్లో బుధవారం ఓటర్ల జాబితాలను ప్రదర్శించనున్నారు. అందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 519 గ్రామపంచాయతీలు ఉండగా 518 ఈనెల 3వతేదీ నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వచ్చాయి.
ఏర్పాట్లు పూర్తిచేసిన కార్యదర్శులు
అభ్యంతరాలు వస్తే స్వీకరణ
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని గ్రామ పంచా యతీల్లో బుధవారం ఓటర్ల జాబితాలను ప్రదర్శించనున్నారు. అందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 519 గ్రామపంచాయతీలు ఉండగా 518 ఈనెల 3వతేదీ నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వచ్చాయి. కొండపికి ఇటీవల ఎన్నికలు నిర్వహించడంతో అక్కడ పాలకవర్గం ఏర్పడింది. అది మినహాయించి మిగిలిన 518 చోట్ల ఓటర్ల జాబితాలను పంచాయతీ కార్యాలయాల్లో వార్డుల వారీగా అందుబాటులో ఉంచనున్నారు. ఓటర్ల జాబితాలను ప్రచురించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో తదనుగుణంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలోని 518 గ్రామ పంచాయతీల్లో 5,158 వార్డులు ఉండగా వార్డుల వారీగా బుధవారం ఓటర్ల జాబితాలను ప్రదర్శించనున్నారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి తదనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు.