12.71లక్షల ఓట్లు డిజిటలైజేషన్
ABN , Publish Date - Jul 26 , 2026 | 03:19 AM
జిల్లాలో జరిగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)లో 12,71,979మంది ఓటర్లు డిజిటలైజేషన్ చేయించుకున్నారు. మొత్తం 13,99,006 మంది ఓటర్లు ఉండగా 1,27,027మంది ఆన్‌కలెక్టబుల్‌లో చేరారు.
జిల్లాలో అన్‌కలెక్టబుల్‌లో చేరినవి 1.27 లక్షలు
31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ
ఓటు లేకపోతే దరఖాస్తుకు అవకాశం
వివరాలు ఇవ్వని వారికి త్వరలో నోటీసులు
ఒంగోలు కలెక్టరేట్, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జరిగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)లో 12,71,979మంది ఓటర్లు డిజిటలైజేషన్ చేయించుకున్నారు. మొత్తం 13,99,006 మంది ఓటర్లు ఉండగా 1,27,027మంది ఆన్‌కలెక్టబుల్‌లో చేరారు. ఈ ఓట్లన్నీ తొలగింపు జాబితాలో చేరాయి. ఈనెల 31న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించనున్నారు. ఆ తర్వా త అన్‌కలెక్టబుల్ జాబితాలో చేరిన ఓటర్లకు నోటీసులు జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పటికి కూడా వారు ఇక్కడ ఉన్నట్లు నిరూపించుకోకపోతే ఆ ఓట్లను తొలగించనున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత ఆగస్టు 30వతేదీ వరకు క్లైయిమ్స్, అభ్యంతరాలను స్వీకరిస్తారు. జూలై 31 నుంచి సెప్టెంబరు 28వరకునోటీసులు, అభ్యంతరాలను స్వీకరించి అక్టోబరు 3న తుది జాబితాను ప్రకటిస్తారు.
అత్యధికంగా అద్దంకి నియోజకవర్గంలో డెత్‌లు
జిల్లాలో ఓటర్లకు సంబంధించి అత్యధికంగా అద్దంకి నియోజకవర్గంలో 10,413 డెత్‌లు ఉన్నాయి. కొండపి 7,062, దర్శి 6,490, కందుకూరు 6,057, ఎస్‌ఎన్‌పాడు 5,870, ఒంగోలు 5,566 డెత్‌లు ఉన్నాయి. పర్మినెంట్‌గా షిఫ్ట్ అయిన ఓట్లు అద్దంకి నియోజకవర్గంలో 5,370, ఒంగోలు 4,694, ఎస్‌ఎన్‌పాడు 4,345, కొండపి 4,420, కందుకూరు 2,614, దర్శిలో 2,319 ఉన్నాయి. మరోచోట డిజిటలైజేషన్ చేసుకున్న ఓటర్లు అద్దంకి నియోజకవర్గంలో 3,028మంది, కొండపి 2,781, ఒంగోలు 2,477, ఎస్‌ఎన్‌పాడు 2,347, దర్శి 2,514మంది, కందుకూరు 1,868 మంది ఉన్నారు. వివరాలు ఇవ్వని(ఆప్‌సెంట్) వారు ఒంగోలు నియోజకవర్గంలో 8,924 మంది, దర్శి 8,254 మంది, కందుకూరు 7,858మంది, ఎస్‌ఎన్‌పాడు 7,551, అద్దంకి 7,458 మంది ఉన్నారు. ఇతరులు 315మంది కలిపి అన్‌కలెక్టబుల్ కింద జిల్లాలో 1,27,027 మంది ఉన్నారు.