Share News

శ్రీశైలానికి పోటెత్తిన భక్త జనం

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:15 PM

ఉగాది బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తజనం శ్రీశైలానికి ఆదివారం భారీగా తరలివెళ్లారు. ఈ క్రమంలో దోర్నాలలో వాహనాల రద్దీ ఏర్పడింది. ప్రధానంగా స్థానిక ఫారెస్టు చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాలు బారులుదీరాయి.

శ్రీశైలానికి పోటెత్తిన భక్త జనం
దోర్నాలలో ఏర్పడిన వాహనాల రద్దీ

దోర్నాలలో వాహనాల రద్దీ

16 నుంచి 20వ తేదీ వరకు ఉగాది బ్రహ్మోత్సవాలు

కర్ణాటక నుంచి భారీగా కాలినడకన శ్రీశైలం వెళ్లిన కన్నడిగులు

పెద్దదోర్నాల, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : ఉగాది బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తజనం శ్రీశైలానికి ఆదివారం భారీగా తరలివెళ్లారు. ఈ క్రమంలో దోర్నాలలో వాహనాల రద్దీ ఏర్పడింది. ప్రధానంగా స్థానిక ఫారెస్టు చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాలు బారులుదీరాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండాపోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. నల్లమల శిగలో కొలువైన ఆది దంపతులు శ్రీభ్రమరాంబికా మల్లికార్జునుల దర్శనార్థం ఆంధ్ర, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచిభక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ముఖ్యంగా కన్నడిగులు భ్రమరాంబికాదేవిని తమ ఆడపడుచుగా భావిస్తారు. ఈ క్రమంలో శివరాత్రి మహోత్సవాలలో గౌరీశంకరుల కల్యాణం జరిగిందని, తమఆడబిడ్డకు చీర, సారె తీసుకు వెళ్లాలని కర్ణాటక రాష్ట్రం నుంచి సుమారు 1200 కిలోమీటర్ల దూరం నుంచి కాలినడకన అడవిలో రాళ్లు, రప్పల మధ్య తీవ్రమైన ఎండను సైతం లెక్కచేయక మొక్కులు తీర్చుకునేందుకు ప్రయాణిస్తున్నారు. దీంతో నల్లమలలో ఓం నమఃశివాయఅంటూ తమ భక్తిని చాటుతూ హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు అటవీ ప్రాంతంలో తాగునీరు, భోజన వసతిని కల్పించారు.

Updated Date - Mar 15 , 2026 | 11:15 PM