Share News

ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:33 AM

అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో చేస్తున్నట్టు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. మండలంలోని ముప్పవరం క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సాయంత్రం సీఎస్‌ఆర్‌ నిధులతో సంతమాగులూరు, కొరిశపాడు, బల్లికురవ, పంగులూరు మండలాలకు చెందిన 35మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లను ఆయన పంపిణీ చేశారు.

ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు

దివ్యాంగురాలికి ట్రైసైకిల్‌ను అందజేస్తున్న మంత్రి రవికుమార్‌

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

పంగులూరు, ఫిబ్రవరి 23 (ఆంధ్ర జ్యోతి) : అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో చేస్తున్నట్టు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. మండలంలోని ముప్పవరం క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సాయంత్రం సీఎస్‌ఆర్‌ నిధులతో సంతమాగులూరు, కొరిశపాడు, బల్లికురవ, పంగులూరు మండలాలకు చెందిన 35మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లను ఆయన పంపిణీ చేశారు. అద్దంకి, పంగులూరు, కొరిశపాడు మండలాలకు చెందిన 91మందికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.77లక్షల 35వేల చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రజాప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిచ్చి అండగా ఉంటుందని చెప్పారు. నియోజకవర్గ పరిధిలో సీఎస్‌ఆర్‌ నిధులతో ఇప్పటివరకు పాఠశాల విద్యార్థులకు 7,500 సైకిళ్లు, 167 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీచేసినట్టు చెప్పారు. 2,509 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు అందజేశామన్నారు. ప్రాధాన్యతాక్రమంలో నిధుల లభ్యతకు అనుగుణంగా రోడ్లు, సామాజిక భవనాలను నిర్మిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఈఈ మస్తానరావు, డీఈ దామోదరం, సురేంద్ర, టీడీపీ మండల అధ్యక్షుడు రావూరి రమేష్‌, కుక్కపల్లి ఏడుకొండలు, చింతల సహదేవుడు, అల్లంనేని బ్రహ్మానందస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 01:33 AM