Share News

అభివృద్ధి మాది.. అరాచకం మీది

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:33 PM

ప్రజా ప్రభుత్వానికి అభివృద్ధి బాట అని.. వైసీపీది అరాచకపు బాట అని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు.

అభివృద్ధి మాది.. అరాచకం మీది
సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే కందుల

ఎమ్మెల్యే నారాయణరెడ్డి

మార్కాపురం టౌన్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వానికి అభివృద్ధి బాట అని.. వైసీపీది అరాచకపు బాట అని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు. స్థానిక 19, 20, 21, 22 వార్డుల్లో సోమవారం ఆయన పర్యటించి పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుందుల మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన మార్కాపురం మున్సిపాలిటీకి రూ.35కోట్లను కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల ద్వారా పట్టణంలో అవసరమైన ప్రతి రోడ్డును సీసీ రోడ్డుగా మారుస్తామన్నారు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా శివారు ప్రాంతాల్లో కూడా సీసీ రోడ్లు వేస్తామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం హయాంలోనే మార్కాపురం జిల్లా, వెలిగొండ పూర్తి, ఇంటింటికీ పైప్‌లైన్‌, హార్టికల్చర్‌ హబ్‌ ద్వారా ఈ ప్రాంతాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామన్నారు. వార్డుల్లో ప్రజల స మస్యలను అడిగి తె లుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జునరావు, గునుపూడి భాస్కర్‌, జనసేన జిల్లా నాయకులు ఇమ్మడి కాశీనాథ్‌, మార్కండేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌ మల్లికార్జునశర్మ, మాజీ కౌన్సిలర్‌ మర్రి ఝాన్సీరాణి, కొప్పుల శ్రీను, షేక్‌ మౌలాలి పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:33 PM