Share News

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి

ABN , Publish Date - Oct 04 , 2026 | 10:36 PM

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. బేస్తవారపేట మండలంలో పల్లె పండుగలో భాగంగా ఆదివారం హెల్త్‌ సెంటర్‌, సీసీను రోడ్లు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రారంభించారు.

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి
సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

హెల్త్‌ క్లినిక్‌, రోడ్లను ప్రారంభించిన

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

బేస్తవారపేట, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. బేస్తవారపేట మండలంలో పల్లె పండుగలో భాగంగా ఆదివారం హెల్త్‌ సెంటర్‌, సీసీను రోడ్లు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రారంభించారు. రూ.36లక్షలతో హెల్త్‌ సెంటర్‌, రూ.15లక్షలతో అంతర్గత రోడ్లు, బేస్తవారపేటలో రూ.1కోటితో రహదారుల నిర్మాణాలు, నేకునాంబాద్‌ రూ.60 లక్షలు, గలిజేరుగుళ్ల రూ.1.45 కోట్లు, జేసీ అగ్రహారం రూ.1.50తో బేస్తవారపేట మండలంలో 11 పనులకు రూ.4.55కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారు అభివృద్ధికి ప్రాధాన్యన కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సోరెడ్డి మోహన్‌రెడ్డి, కంభం మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ పూనూరు భూపాల్‌రెడ్డి, యాలం వెంకటేశ్వర్లు, సత్యేలి కృష్ణ యాదవ్‌, బోయిళ్ల శ్రీనీశ్వర్‌రెడ్డి, తీగిరెడ్డి భూపాల్‌రెడ్డి, ఆవుల శ్రీనివాసరెడ్డి,మూప్పూరిరాము పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 10:36 PM