Share News

దృఢ సంకల్పమే బలమైన పునాది

ABN , Publish Date - Jul 21 , 2026 | 03:09 AM

అద్భుత విజయాలు అందుకునేందుకు దృఢ సంకల్పమే బలమైన పునాది అని కలెక్టర్‌ రాజా బాబు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడి యెట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభచూపిన విద్యార్థులకు సోమవారం స్థానిక రిమ్స్‌ ఆడిటోరి యంలో షైనింగ్‌ స్టార్‌ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.

దృఢ సంకల్పమే బలమైన పునాది
షైనింగ్‌ స్టార్‌ అవార్డులు అందుకున్న విద్యార్థులతో కలెక్టర్‌ రాజాబాబు, ఎమ్మెల్సీ శ్రీకాంత్‌, ఎమ్మెల్యేలు జనార్దన్‌, విజయ్‌కుమార్‌, అధికారులు

కలెక్టర్‌ రాజాబాబు

ఘనంగా షైనింగ్‌ స్టార్‌ అవార్డుల ప్రదానం

హాజరైన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ఒంగోలు విద్య, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : అద్భుత విజయాలు అందుకునేందుకు దృఢ సంకల్పమే బలమైన పునాది అని కలెక్టర్‌ రాజా బాబు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడి యెట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభచూపిన విద్యార్థులకు సోమవారం స్థానిక రిమ్స్‌ ఆడిటోరి యంలో షైనింగ్‌ స్టార్‌ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఉత్తమ విధా నాలను ప్రవేశపెట్టి వాటి అమలును నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. దీంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తెలిపారు. చిన్నతనంలో తాను కూడా కష్టాలు పడ్డానని, విద్య విలువను గుర్తించుకొని చదువుకోవడం వల్లనే ఉన్నతస్థానానికి చేరుకున్నానని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాన్ని విజయవంతమైన కెరియర్‌కు తొలిమెట్టుగా చేసుకోవాలన్నారు. కుటుంబానికి, రాష్ట్రానికి మంచిపేరు తెచ్చేవారిగా ఎదగాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. శాసనమండలి సభ్యుడు కంచర్ల శ్రీకాంత్‌ మాట్లాడుతూ రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. అందులోభాగంగానే విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. కందుకూరులోని తమ ప్రకాశం ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీలో చేరే షైనింగ్‌ స్టార్స్‌ విద్యార్థులకు ఉచితంగా హాస్టల్‌ వసతి కల్పిస్తామని ఆయన ప్రకటించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో గతేడాది నాల్గో స్థానంలో ఉన్న మన జిల్లా ఈ విద్యాసంవత్సరంలో మొద టి స్థానానికి వచ్చేలా మరింత ఉత్సాహంతో పనిచేయాలని ఉపాధ్యాయులకు పిలుపుని చ్చారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.35వేల కోట్లు కేటాయించడమే విద్యారంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నదని వివరించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌.విజయకుమార్‌ మాట్లాడుతూ ఏరంగంలో రాణించాలన్నా విద్యే కీలకమన్నారు. అందుకే విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. కేవలం మార్కులపైనే కాకుండా విద్యార్థుల సమగ్ర ఎదుగుదలపై దృష్టి సారించిందని చెప్పారు. మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య మాట్లాడుతూ సవాళ్లను అధిగమించి సత్ఫలితాలు సాధించడంలో మంత్రి లోకేష్‌ను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ విజయకుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ముప్పవరపు సుచిత్రలు విద్యార్థులనుద్దేశించి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులకు సైనింగ్‌స్టార్స్‌ అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో డీఈవో రేణుక, ఆర్‌ఐవో ఆంజనేయులు పాల్గొన్నారు. వేడుక ప్రారంభంలో చిన్నారులు చేసిన నృత్యప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

Updated Date - Jul 21 , 2026 | 03:09 AM