చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:07 PM
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్మాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అద్దంకి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి) : అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్మాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు... అద్దంకి పట్టణంలోని రాజీవ్‌కాలనీకి చెందిన షేక్ ఖాదర్‌బాషా(40) ఫొటో స్టుడియో నిర్వహిస్తున్నాడు. అప్పుల బాధతో జనవరి 27వ తేదీ రాత్రి స్టుడియో వద్ద కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకొని తాగి ఇంటికి వెళ్లాడు. వాంతులు చేసుకుంటుండగా భార్య ప్రశ్నించటంతో విషయం చెప్పాడు. ఒంగోలు రిమ్స్‌కు తరలించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు.