Share News

ఇంటి పన్నుల వసూళ్లకు గడువు పెంపు

ABN , Publish Date - Mar 17 , 2026 | 02:58 AM

ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఇంటి పన్నుల వసూళ్లకు మరోసారి పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గడువు పెంచారు. రెండు జిల్లాల్లో ఇంకా రూ.20కోట్ల మేర బకాయిలు ఉండటంతో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇంటి పన్నుల వసూళ్లకు గడువు పెంపు

25లోపు నూరుశాతం రాబట్టాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఆదేశాలు

రెండు జిల్లాల్లో రూ.20కోట్ల మేర పెండింగ్‌

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 16 (ఆంధ్ర జ్యోతి): ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఇంటి పన్నుల వసూళ్లకు మరోసారి పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గడువు పెంచారు. రెండు జిల్లాల్లో ఇంకా రూ.20కోట్ల మేర బకాయిలు ఉండటంతో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.52.60 కోట్ల మేర పన్ను వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ రూ.32.79 కోట్లను మాత్రమే రాబట్టారు. టంగు టూరు, సింగరాయకొండ మండలాల్లో సుమా రు రూ.4 కోట్ల వరకు, బల్లికురవ మండలంలో కూడా కోటికిపైగా ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. కొన్ని మండలాల్లో రూ.10లక్షల నుంచి రూ.40 లక్షల వరకు రావాల్సి ఉన్నట్లు తెలిసింది. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ జిల్లాకు రోజుకు రూ.2కోట్లు లక్ష్యంగా నిర్దేశించి ఈ పది రోజుల్లో రూ.20కోట్లు వసూలు చేయాలని ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు కలెక్టర్‌ రాజాబాబు కూడా రెండు జిల్లాల్లో పన్నులు వసూళ్లు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 80 నుంచి 100 శాతంలోపు 102 గ్రామపంచాయతీల్లో పన్నులు వసూలు చేయగా, మరికొన్ని మండలాల్లో 50 నుంచి 60శాతంలోపు మాత్రమే చేశారు. పన్నులు వసూళ్లు తక్కువగా ఉన్న పంచాయతీలపై ప్రత్యేక దృష్టిసారించి నూరుశాతం సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీపీవో వెంకటేశ్వరరావు తెలిపారు.

Updated Date - Mar 17 , 2026 | 02:58 AM