పాఠశాల ప్రాంగణంలో పొంచి ఉన్న ప్రమాదం
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:00 AM
పర్చూరు బొమ్మల కూడలి సమీపంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో చిరు వ్యాపారులు నిర్మించిన గోడ శిథిలావస్థకు చేరి ప్రమాదభరితంగా మారింది.
పర్చూరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : పర్చూరు బొమ్మల కూడలి సమీపంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో చిరు వ్యాపారులు నిర్మించిన గోడ శిథిలావస్థకు చేరి ప్రమాదభరితంగా మారింది. పాఠశాల ప్రాంగ ణం నుంచి డ్రైనేజీ కాలువను చిరు వ్యాపా రులు ఆక్రమించారు. వారు వీధివైపు వ్యాపా రాలు నిర్వహించుకుంటూ తమ దుకాణాల గోడను పాఠశాల వైపు ఎత్తుగా ఏర్పాటు చేశారు. ఎలాంటి పటిష్ట పునాది లేకుండా కేవలం మొండి ఇటుకలతో ఎత్తుగా పేర్చిన గోడ ఎప్పుడు కూలుతుందో అర్థం కావడం లేదని పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శిథిలావస్థకు చేరిన గోడ వెంబడే ఆటస్థలం ఉందని, నిత్యం విద్యార్థులు అక్క ఆటలు ఆడుకుం టారని, ప్రస్తుతం గోడ కూలే ప్రమాదం ఉందని వాపోతున్నారు. తక్షణమే గోడను తొల గించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.