Share News

దెబ్బతిన్న కారు

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:19 PM

జాతీయ రహదారిలో మేదరమెట్ల ఫ్లైఓవర్‌పై ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి కారుఢీకొన్న సంఘటలలో నలుగురు గాయపడ్డారు.

దెబ్బతిన్న కారు

ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొన్న కారు

నలుగురికి గాయాలు

మేదరమెట్ల, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి) : జాతీయ రహదారిలో మేదరమెట్ల ఫ్లైఓవర్‌పై ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి కారుఢీకొన్న సంఘటలలో నలుగురు గాయపడ్డారు. బుధవారం వేకువజామున బెంగళూరు నుంచి అనిల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి తండ్రి దశదిన కర్మకు విజయవాడ వెళ్తుండగా వేకువజామున 3 గంటల సమయంలో మేదరమెట్ల ఫ్లైఓవర్‌పై గుర్తు తెలియని వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో కారులోని అనిల్‌ కుమారుడు తనీష్‌, భార్య మానస, మరో కుమారుడు హవిష్‌ , డ్రైవర్‌ గాయపడ్డారు. ఏఎ్‌సఐ అహ్మద్‌ సంఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన వారిని 108లో హాస్పిటల్‌కు తరలించారు.

Updated Date - Oct 07 , 2026 | 11:19 PM