649 హెక్టార్లలో పంటలకు నష్టం
ABN , Publish Date - Mar 22 , 2026 | 01:28 AM
జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షానికి 649 హెక్టార్లలో రెండు రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
వ్యవసాయ శాఖ అధికారుల ప్రాథమిక అంచనా
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 21 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షానికి 649 హెక్టార్లలో రెండు రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దర్శి మండలంలో ఎనిమిది గ్రామాలకు చెందిన 746మంది రైతులకు సంబంధించిన పంటలకు నష్టం వాటిల్లినట్లు తేల్చారు. లింగసముద్రం మండలంలో ఒక గ్రామానికి చెందిన 24మందికి చెందిన పంట లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. వరి 709 మంది రైతులకు చెందిన 586 హెక్టార్లు, మొక్కజొన్న 61 మంది రైతులకు చెందిన 60 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు.