వైసీపీ అసత్యాలను తిప్పికొట్టండి
ABN , Publish Date - Jun 25 , 2026 | 03:17 AM
కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించ డంతోపాటు వైసీపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. తెలు గుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం బుధవారం ఒంగోలులోని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ చీప్ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తోపాటు, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
రెండేళ్ల ప్రగతిని ప్రజలకు వివరించండి
సర్ కార్యక్రమం పూర్తిస్థాయిలో సాగేలా శ్రేణులు బాధ్యత వహించాలి
టీడీపీ ఒంగోలు పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో నేతల పిలుపు
ఒంగోలు కార్పొరేషన్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించ డంతోపాటు వైసీపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. తెలు గుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం బుధవారం ఒంగోలులోని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ చీప్ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తోపాటు, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముందుగా కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను రెండేళ్లలోనే నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలోఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమం, అభివృద్ధి కోసం వేల కోట్లు వ్యయం చేస్తున్నారన్నారు. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సర్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు బూత్ స్థాయి నుంచే పాల్గొనాలని కోరారు. పార్టీ చేపట్టే కుటుంబ సాధికార సారథిలో ప్రతి కార్యకర్త తమ వివరాలు నమోదు చేసుకోవా లన్నారు. 2029లో పార్టీ గెలుపు కోసం ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ పార్టీ బలంగా ఉండాలంటే కార్యకర్తలు, నాయకుల పాత్ర కీలకమైనదన్నారు. సర్‌లో భాగంగా జరుగుతున్న ఓటరు సర్వే పత్రాలు ఇవ్వడంలో స్పీడు ఉన్నప్పటికీ, తిరిగి ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. స్థానికంగా ఓటు ఉన్నప్పటికీ ఉద్యోగ, వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి ఓటరు పార్టీకి ఎంతో ముఖ్యమన్నారు. అందుకోసం బూత్ స్థాయి నుంచి క్లస్టర్, మండల, నియోజకవర్గ స్థాయిలో సర్‌లో పాల్గొనాలని నేతలకు సూచించారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నప్పటికీ వైసీపీ నాయకులు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు ఆయా మండలాల పరిధిలోని నేతలు వైసీపీ అసత్యాలను తిప్పి కొట్టాలన్నారు. పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేపట్టినా వాటిని మై టీడీపీ యాప్ ద్వారా సోషల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ర్టానిక్ మీడియా ద్వారా తెలియజేయాలన్నారు. అప్పుడే పార్టీలో నాయకుల పనితీరుకు గుర్తింపు ఉంటుందన్నారు. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ప్రతి నాయకుడు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నారు. స్థానికంగా ఉండే చిన్నచిన్న పొరపాట్లను సర్దుకుని కలిసి ఐక్యంగా పనిచేయాలని సూచించారు. రెండేళ్ల పాలనలో పార్టీలోని కొందరు అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తుందన్నారు. అయితే పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందన్నారు. రాబోయే పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరం కలిసి కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి, నగర అధ్యక్షుడు బండారు మదన్, మునిసిపల్ మాజీ ఛైర్మన్ మంత్రి శ్రీనివాసరావుతోపాటు ఒంగోలు పార్లమెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.