హెచ్‌ఐవీ నియంత్రణ ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి
ABN , Publish Date - Sep 23 , 2026 | 09:57 PM
హెచ్‌ఐవీ - ఎయిడ్స్ నియంత్రణే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని కలెక్టర్ ఎం.విజయ సునీత అన్నారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు సెంటర్‌లోని అరవింద్ ఘోష్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి బుధవారం 5కే మారధాన్‌ను కలెక్టర్ విజయసునీత జెండా ఊపి ప్రారంభించారు.
కలెక్టర్ విజయసునీత
మార్కాపురం టౌన్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : హెచ్‌ఐవీ - ఎయిడ్స్ నియంత్రణే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని కలెక్టర్ ఎం.విజయ సునీత అన్నారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు సెంటర్‌లోని అరవింద్ ఘోష్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి బుధవారం 5కే మారధాన్‌ను కలెక్టర్ విజయసునీత జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయసునీత మాట్లాడుతూ హెచ్‌ఐవీ - ఎయిడ్స్‌పై ప్రజ ల్లో అవగాహన పెంపే లక్ష్యంగా మారధాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెచ్‌ఐవీపై ఉన్న అపోహలను తొలగించాలన్నారు. ని వారణ చర్యలపై చైతన్యం కల్పించాలన్నా రు. హెచ్‌ఐవీ రహిత సమాజం కోసం అం దరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కుష్ఠు వ్యాధి నివారణాధికారి డాక్టర్ కె.రాహుల్, డాక్టర్ సాయికిరణ్, డాక్టర్ సాయిచరణ్, డాక్టర్ హరీష్, డాక్టర్ శివారెడ్డి, ఏపీ సాక్స్ కోఆర్డినేటర్ అమీన్, హెల్త్ అసిసెంట్లు, సూపర్‌వైజర్లు, ఏపీ సాక్స్ సిబ్బంది పాల్గొన్నారు.