జెట్టీ ఏర్పాటుతో మత్స్యకార జీవితాల్లో వెలుగులు
ABN , Publish Date - Apr 08 , 2026 | 11:26 PM
ఎన్నికలకు ముందు తీరప్రాంత మత్స్యకార కుటుంబాలకు ఇచ్చిన హామీలను, ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చెప్పారు.
ఎమ్మెల్యే ఇంటూరి
గుడ్లూరు, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికలకు ముందు తీరప్రాంత మత్స్యకార కుటుంబాలకు ఇచ్చిన హామీలను, ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చెప్పారు. మండలంలోని సాలిపేట పంచాయతీ, మూర్తింపేటలో మత్స్యకారుల వేటకు అనువుగా, రూ.28 కోట్లతో నిర్మించనున్న జెట్టీకి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రామాయపట్నం పోర్టు నిర్వాసితులందరికీ, గత వైసీపీ ప్రభుత్వంలా కాకుండా, ప్రజా ప్రభుత్వం న్యాయం చేస్తోందన్నారు. మూర్తింపేటలో 4.69 ఎకరాల్లో రూ.28 కోట్ల అంచనా విలువతో ఈ జెట్టీ నిర్మాణం చేపడుతునట్లు తెలిపారు. దీని నిర్మాణంతో మత్స్యకార కుటుంబాలలో ఆనందం ఉంటుందన్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణంతో పాటు బీపీసీఎల్, ఇండోసోల్ అనుబంద పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. దీంతో ఉద్యోగ భద్రత పెరగనుందన్నారు. తదనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు కర్లపాలెం వద్ద త్వరలో స్కిల్‌డెవల్‌పమెంట్ సెంటర్‌ను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకులు అరాచక పరిస్ధితి రాష్ట్రం తారస్థాయికి చేరిందన్నారు. వాస్తవాలను విడమరచి చెప్పిన ‘ఏబీఎన్-ఆంఽధ్రజ్యోతి’పై వైసీపీ మూకలు దాడిచేస్తుండడం, వారి పైశాచిక పరాకాష్టకు నిదర్శనమన్నారు. ‘ఆంధ్రజ్యోతి’పై వైసీపీ చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఈ సందర్బంగా ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో పోర్టు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివరాం, తహసీల్దార్ బాలకిషోర్, ఎంపీడీవో వై.వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు, నాయకులు వేముల స్వామి, ఆవుల శ్రీను, చేపల రమణయ్య, అట్ల కోటయ్య, గోల్లప్రోలు హరిప్రసాద్, పొట్టేళ్ల మురళీ, ప్రోలుగంగు కృష్ణ, గద్దగుంట శ్రీను, అవనిగడ్డ కృష్ణ, యనమల రామారావు, కొండబాబు, సుధాకర్ మత్స్యకార కాపునేతలు పాల్గొన్నారు.