మిగిలిన ఓటర్ల సమగ్ర పరిశీలన
ABN , Publish Date - Jul 22 , 2026 | 01:12 AM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును కేంద్ర ఎన్నికల సంఘం పెంచడంతో కొంతమేర పురోగతి కనిపిస్తోంది. జిల్లాలో మొత్తం 13,99,006 మంది ఓటర్లు ఉండగా ఈనెల 15వతేదీ నాటికి 12,69,595 మంది డిజిటలైజేషన్ చేయించుకున్నారు.
ఇంకా 1.26లక్షల మంది వివరాలు అందని పరిస్థితి
వారంలో 12వేల మందికి పైగా ఓటర్ల వివరాల సేకరణ
మిగిలిన వారివి సేకరించే ప్రయత్నంలో బీఎల్వోలు
గత ఎన్నికల్లో ఓట్లు వేసిన సంచార జాతులు
వారి తల్లిదండ్రుల పేర్లు చెప్పలేకపోతున్న వైనం
ఒంగోలు కలెక్టరేట్, జూలై 21 (ఆంధ్ర జ్యోతి) : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును కేంద్ర ఎన్నికల సంఘం పెంచడంతో కొంతమేర పురోగతి కనిపిస్తోంది. జిల్లాలో మొత్తం 13,99,006 మంది ఓటర్లు ఉండగా ఈనెల 15వతేదీ నాటికి 12,69,595 మంది డిజిటలైజేషన్ చేయించుకున్నారు. ఇంకా 1,29,411 మంది మిగిలి ఉన్నారు. వీరిలో 40వేల మందికిపైగా మృతి చెందినట్లు గుర్తించారు. 23వేల మందికి పైగా ఓటర్లు వివిధ ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. మరో 13,746మం ది ఇతర చోట్ల తమ ఓటును డిజిటలైజే షన్ చేయించుకున్నారు. ఇక 51,460 మంది ఓటర్లు మ్యాపింగ్‌కు ముందుకు రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెల కొడంతో కేంద్ర ఎన్నికల సంఘం గడు వును ఈనెల 24వతేదీ వరకు పెంచింది. మరోసారి క్షేత్రస్థాయిలో బీఎల్వోలు పరి శీలన చేపట్టారు. ఆరు రోజుల వ్యవధిలో 12,600 మంది ఓటర్లు తగిన ఆఽధారాలతో డిజిటలైజేషన్ చేయించుకున్నారు.
డిజిటలైజేషన్‌కు మ్యాపింగ్ కష్టాలు
కేంద్ర ఎన్నికల సంఘం 2002 ఓటర్ల జాబితా మ్యాపింగ్ ఆధారంగా డిజిట లైజేషన్ చేయాలని ఆదేశించింది. అయితే ప్రస్తుతం గుర్తించిన ఓటర్లు తమ పూర్వీ కుల వివరాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం. ఒంగోలుతోపాటు వివిధ ప్రాంతాల్లో సంచారజాతులు నివా సాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. వీరిలో కొందరికి తమ పూర్వీకుల వివరా లు తెలియకపోయినా కనీసం వారి స్వగ్రామం, తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పలేకపోతున్నట్లు సమాచారం. వారందరూ 2025 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2002 వివరాలు చెప్పలేని కారణంగా వారి ఓట్లను నో మ్యాపింగ్ కింద నమోదు చేసి ఉన్నారు. మరో నాలుగు రోజులు గడువు ఉండటం తో ఈలోపు మరికొంత మంది వివరాల ను సేకరించి డిజిటలైజేషన్ చేసేందుకు బీఎల్వోలు చర్యలు తీసుకుంటున్నారు.