అంగన్‌వాడీల్లో చిన్నారులకు సకల వసతులు
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:37 PM
అంగన్‌వాడీ కేంద్రాలలోని చిన్నారులకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి చెప్పారు.
అంగన్‌వాడీ కేంద్రాలకు 381 స్టౌవ్‌లను పంపిణీ చేసిన మంత్రి స్వామి
తూర్పునాయుడుపాలెం(కొండపి), జూలై 13 (ఆంధ్రజ్యోతి) : అంగన్‌వాడీ కేంద్రాలలోని చిన్నారులకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి చెప్పారు. సోమవారం ఉదయం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో టంగుటూరు, కొండపి ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు 381 ఎలక్ర్టికల్ స్టౌవ్‌లను మంత్రి అందచేశారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ అధకారులు, అంగన్‌వాడీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని, చిన్నారుల మనోవికాస విజ్ఞాన కేంద్రాలుగా నిర్వహించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో కొండపి సీడీపీవో సుశీలాదేవి, టంగుటూరు ప్రాజెక్టు సీడీపీవో అంజలీదేవి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ విక్టోరియారాణి పాల్గొన్నారు.