Share News

ఎల్‌ఐసీ స్కాంపై పోలీసులకు ఫిర్యాదు

ABN , Publish Date - Jan 24 , 2026 | 01:31 AM

కందుకూరు ఎల్‌ఐసీ బ్రాంచ్‌లో ఏజెంటుగా ఉండి ప్రస్తుతం మార్కాపు రంలో డీవోగా పనిచేస్తున్న పూజల శ్రీనివాసరావుపై ఆ శాఖ అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. నకిలీ మరణ ధ్రువపత్రాలతో క్లెయిమ్‌లు చేసి స్వాహా చేసిన వ్యవహారంపై డీవోపై ఫిర్యాదు అందిందని, సమగ్ర వివరాలతో కేసు నమోదు చేస్తామని పట్టణ ఎస్‌ఐ పి.శివనాగరాజు తెలిపారు.

ఎల్‌ఐసీ స్కాంపై పోలీసులకు ఫిర్యాదు

సమగ్ర సమాచారంతో కేసు నమోదు చేస్తాం : ఎస్‌ఐ

కందుకూరు, జనవరి 23 (ఆంధ్ర జ్యోతి) : కందుకూరు ఎల్‌ఐసీ బ్రాంచ్‌లో ఏజెంటుగా ఉండి ప్రస్తుతం మార్కాపు రంలో డీవోగా పనిచేస్తున్న పూజల శ్రీనివాసరావుపై ఆ శాఖ అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. నకిలీ మరణ ధ్రువపత్రాలతో క్లెయిమ్‌లు చేసి స్వాహా చేసిన వ్యవహారంపై డీవోపై ఫిర్యాదు అందిందని, సమగ్ర వివరాలతో కేసు నమోదు చేస్తామని పట్టణ ఎస్‌ఐ పి.శివనాగరాజు తెలిపారు. అవినీతి వ్యవహారం విజిలెన్స్‌ విచారణలో బయటపడిందని, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని బ్రాంచ్‌ మేనేజరు ఫిర్యాదు చేశారని ఆయన వెల్లడించారు.

Updated Date - Jan 24 , 2026 | 01:31 AM