ఒంగోలు జాతి గిత్తలను ప్రోత్సహించేందుకు పోటీలు దోహదం
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:38 PM
ఒంగోలు జాతి గిత్తల యజమానులను ప్రోత్సహించేందుకు ఎడ్ల బలప్రదర్శన పోటీలు దోహదపడతాయని గన్నవరం, ఒంగోలు ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, దామచర్ల జనార్దన్ చెప్పారు.
ఎమ్మెల్యేలు యార్లగడ్డ, దామచర్ల
హోరాహోరీగా ఒంగోలు గిత్తల బలప్రదర్శన
మద్దిరాలపాడులో ముగిసిన జాతీయస్థాయి పోటీలు
నాగులుప్పలపాడు, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు జాతి గిత్తల యజమానులను ప్రోత్సహించేందుకు ఎడ్ల బలప్రదర్శన పోటీలు దోహదపడతాయని గన్నవరం, ఒంగోలు ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, దామచర్ల జనార్దన్ చెప్పారు. మద్దిరాలపాడు గ్రామంలోని పీవీసీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో మండవ వెంకటరావు మెమోరియల్ ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకులు గుమ్మడి సాయిబాబా పర్యవేక్షణలో ఏడో రోజు జాతీయస్థాయి ఒంగోలు జాతి సీనియర్ విభాగం ఎడ్ల బలప్రదర్శన పోటీలను ఆదివారం రాత్రి ఎమ్మెల్యే విజయ్‌కుమార్, మాజీ మంత్రి శిద్దా రాఘవరావులతో కలసి వారు ప్రారంభించారు. తొలుత వేదికపై మండవ వెంకట్రావు, ఎన్టీఆర్ విగ్రహాలకు అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శనివారం నిర్వహించిన జానియర్ విభాగంలో గెలుపొందిన ఎడ్ల యజమానులకు నగదు బహుమతులను అందజేశారు. సీనియర్స్ విభాగంలో 2200 కిలోల బరువును 25 నిమిషాల వ్యవధిలో లాగేందుకు నిర్వహించిన బలప్రదర్శన పోటీలలో 14 జతల గిత్తలు పాల్గొన్నాయి. మార్కాపురం జిల్లా కంభం మండలం దర్గ గ్రామానికి చెందిన లాయర్ దామా వెంకటకృష్ణకు చెందిన గిత్తలు, కృష్ణా జిల్లా విజయవాడ మండలం గన్నవరం గ్రామానికి చెందిన వల్లభనేని మోహనరావు ఎడ్ల జత, ప్రకాశం జిల్లా బల్లికురవకు చెందిన పావులూరి వీరాస్వామిచౌదరి ఎడ్లు, నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన అయితరాజు సత్యనారాయణ గిత్తలు, తెలంగాణ రాష్ట్రం హుజూర్‌నగర్‌కు చెందిన సుంకి సాకేత్, సారికా రెడ్డిల ఎడ్ల జత, గుంటూరు జిల్లా కాకుమాను మండలం కోదండబాలవారిపాలేనికి చెందిన గూడపల్లి దీక్షిత్‌చౌదరి,అదే మండలం కొండపాటూరుకు చెందిన పోతిన లక్షిత్‌చౌదరి కంబైన్డ్ ఎడ్ల జత, మార్కాపురం జిల్లా బోడిచెర్ల గ్రామానికి చెందిన తిండి నక్షత్రారెడ్డి గిత్తలు, పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నానికి చెందిన షేక్ సత్తార్ జత, మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం వీరాయపాలేనికి చెందిన దూదేకుల పెదచాంద్ గిత్తలు, బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలేనికి చెందిన అత్తోట శిరీష, శివకృష్ణ చౌదరిల ఎడ్ల జత, గుంటూరు జిల్లా రెడ్డిపాలేనికి చెందిన కారసాని దివాకర్‌రెడ్డి, అదే జిల్లా కాకుమాను మండలం కొండబాలవారిపాలేనికి చెందిన గూడవల్లి లక్ష్మీధీక్షిత్ కంబైన్డ్ గిత్తలు, బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లికి చెందిన కంది అంజిరెడ్డి, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన పెరుమాళ్ల శివకృష్ణ యాదవ్ కంబైన్డ్ ఎడ్ల జత, మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం జెసి అగ్రహారం గ్రామానికి చెందిన లక్కు శివసాయి సాత్విక్ ఎడ్లు, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లపల్లికి చెందిన అక్కినేని ముకుల్‌సత్య చౌదరి, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన లంకిరెడ్డి నిక్షిత్‌రెడ్డి గిత్తలు సత్తా చాటాయి. న్యాయనిర్ణేతలుగా కారుసాల రామాంజనేయులు, దండా నారాయణరావు, వ్యాఖ్యాతలుగా దుర్గి శ్రీను, సాయినాధ్‌రెడ్డి, వేమారెడ్డి వ్యవహరించారు. కార్యక్రమంలో ఒడా చైర్మన్ షేక్ రియాజ్, జనసేన నాయకులు కంది రవిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ ముప్పవరపు సుచిత్రచౌదరి, ప్రకాశం జిల్లా కమ్మసేవా సమితి అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, శిద్దా సుధీర్‌కుమార్, టీడీపీ నేతలు పమిడి రమేష్, గొల్లపూడి సుబ్బారావు, మండవ రాంబాబు, ఇంటూరి శ్రీనివాసరావు, తేళ్ల మనోజ్‌కుమార్, కాకర్ల లక్ష్మ్మీవరప్రసాద్( చిన్నా), పోతినేని శ్రీనివాసరావు, దివి పున్నారావు, పెనుబోతు సునీల్‌బాబు, షేక్ ఖాజావలి, నెప్పల శివకృష్ణ, పాలడుగు మురళీ, పెనుబోతు హనుమంతరావు, కాకా రంగారావు, ఎర్రా దశరథరామయ్య, నల్లూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.