Share News

పెట్టుబడులతో రండి.. పరిశ్రమలు పెట్టండి..

ABN , Publish Date - Jun 18 , 2026 | 03:05 AM

‘పెట్టుబడులతో రండి.. పరిశ్రమలు స్థాపించండి’ అంటూ జిల్లా యంత్రాంగం పిలుపునిస్తోంది. వ్యాపారుల పెట్టుబడులు, స్థానిక వనరుల సద్వినియోగం ద్వారా పరిశ్రమల స్థాపనతో ఉపాధి మార్గాలు పెంచాలని చూస్తోంది

పెట్టుబడులతో రండి.. పరిశ్రమలు పెట్టండి..

వ్యాపార ప్రముఖులను ఆకర్షించేలా 22న వారితో ప్రత్యేక ముఖాముఖి

కలెక్టర్‌ నేతృత్వంలో యంత్రాంగం ఏర్పాట్లు 8 అనుకూలతలపై సమగ్ర నివేదిక

ఉమ్మడి జిల్లాతోపాటు ఇతరప్రాంతాలకు చెందిన పెట్టుబడిదారులకు ఆహ్వానం

రూ.10 కోట్ల నుంచి రూ.100 కోట్ల టర్నోవర్‌ చేసే వారిపై ప్రత్యేక దృష్టి

‘పెట్టుబడులతో రండి.. పరిశ్రమలు స్థాపించండి’ అంటూ జిల్లా యంత్రాంగం పిలుపునిస్తోంది. వ్యాపారుల పెట్టుబడులు, స్థానిక వనరుల సద్వినియోగం ద్వారా పరిశ్రమల స్థాపనతో ఉపాధి మార్గాలు పెంచాలని చూస్తోంది. తద్వారా స్థానిక ప్రజానీకం ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యాపార ప్రముఖులతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుకు సంకల్పించింది. కలెక్టర్‌ రాజాబాబు సారథ్యంలో సంబంధిత శాఖల అధికారులు ఇందుకోసం ఈనెల 22న ఒంగోలులో ప్రకాశం బిజినెస్‌ ఎలైట్‌ మీట్‌ (వ్యాపార ప్రముఖుల సమావేశం) నిర్వహిస్తున్నారు.

ఒంగోలు, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగంతోపాటు ఇతర రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షి స్తోంది. తద్వారా ఉపాధి అవకాశాల పెంపు, ఆర్థి కాభివృద్ధికి కృషి చేస్తోంది. జిల్లాలో స్థానిక వన రుల ఆధారంగా పెట్టుబడులు లక్ష్యంగా వ్యాపారు లతో ముఖాముఖికి కలెక్టర్‌ ఉపక్రమించారు. జిల్లాలో అపారంగా ప్రభుత్వ, అసైన్డ్‌ భూ ములు, రైలు, రోడ్డు రవాణా మార్గాలు, విస్తారం గా తీర ప్రాంతం, కష్టించి పనిచేసే ప్రజానీకం ఉంది. దీంతోపాటు ప్రస్తుత ప్రభుత్వ చొరవతో అనేక పరిశ్రమలు, చిన్నతరహా వాటి కోసం కూడా మౌలిక సదుపాయాల కల్పన జరుగు తోంది. ప్రధానంగా రామాయపట్నం పోర్టు తొలి దశ నిర్మాణం ఒక కొలిక్కి వస్తోంది. ఇదే ప్రాం తంలో బీపీసీఎల్‌ ప్రాజెక్టును ఇండోసోల్‌, జేఎస్‌ డబ్ల్యూ కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభిం చేందుకు చర్యలు చేపట్టాయి. అలా సమారు రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు జిల్లాకు వాటి ద్వారా వస్తున్నాయి. అలాగే దొనకొండ పారిశ్రా మిక కారిడార్‌ వద్ద వేలాది ఎకరాల భూములు సిద్ధంగా ఉండగా పలు పెద్ద కంపెనీలు అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి.

విస్తారంగా తీరం.. టూరిజంకు అనుకూలం

జిల్లాలో విస్తారంగా ఉన్న తీరప్రాంతం టూరిజం అభివృద్ధికి అత్యంత అనుకూలం. ఆక్వా రంగం విస్తరించేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధానంగా ఉన్న పొగాకు పంటతోపాటు సామా జిక వనాల సాగు పెరుగుతోంది. మరోవైపు ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో చేపట్టిన రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌లో ఉమ్మడి జిల్లాను చేర్చింది. దీని ద్వారా ఆ రంగం మరింత విస్తరించనుంది. ఇలా ఇన్ని సానుకూలతలు, వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ జిల్లాలో స్థానిక పెట్టుబడిదారులు, వ్యాపారులు ఒక్క గ్రానైట్‌ రంగంలో మినహా ఇతర పెట్టుబడులపై ఎలాంటి దృష్టిపెట్టడం లేదు. కాస్తంత ఆర్థిక వనరులు అందుబాటులో ఉన్నవారు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి అవకాశం ఉన్న వ్యాపారాలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న వనరుల సద్విని యోగంపై అలాంటి వారికి సరైన అవగాహన ఉండకపోవడమే ఇందుకు కారణమైంది.

అనేక ప్రాజెక్టులకు అవకాశం

ప్రస్తుతం జిల్లాలో గతం నుంచి ఉన్న వన రులు, ఇటీవల కాలంలో వస్తున్న భారీ ప్రాజెక్టులకు అనుబంధంగా అనేక రంగాల్లో పెట్టుబ డులకు వాతావరణం అనుకూలంగా ఉంది. ప్రధానంగా జిల్లాలో పోర్టు.. దాని ఆధారంగా వస్తున్న ఇండోసోల్‌, బీపీసీఎల్‌ ప్రాజెక్టులు, జేఎస్‌డబ్ల్యూ సంస్థల ద్వారా రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వాటికి అనుబంధంగా అనేక చిన్న మధ్యస్థాయి పరిశ్రమలు, భారీ గోడౌన్లు, పెద్దఎత్తున హాస్పిటాలిటీ వంటివి అవసరం కానున్నాయి. విస్తారంగా ఉన్న తీర ప్రాంతంలో టూరిజం అభివృద్ధిలో భాగంగా రిస్టార్ట్‌లు, హోటళ్లు, ఆక్వా రంగం విస్తరణతో హేచరీలు, రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్లకు అవకాశం ఉంది. ఇక దొనకొండ పారిశ్రామిక కారిడార్‌తోపాటు అనేకచోట్ల పరిశ్రమల ఏర్పాటుకు ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం చిన్న,పెద్ద పరిశ్రమలు.. వ్యాపారాలకు అనుకూలంగా అనేక విధానాలు రూపకల్పన చేసింది. భూముల కేటాయింపు, విద్యుత్‌, నీరు, ఇతర సౌకర్యాల కల్పన వంబటి వాటితోపాటు త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది.

స్థానికంగా పెట్టుబడులు పెట్టాలి

జిల్లాలో పెట్టుబడులకు, వ్యాపారాలకు ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ ఇక్కడి వ్యాపార ప్రముఖులు స్థానికంగా తమ వ్యాపార సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించడం లేదు. దీంతో జిల్లాలో ఉపాధి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉండటంతో పాటు అర్థికాభివృద్ది ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో స్థానిక వనరులు, పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న పరిస్థితులను జిల్లావాసులైన అలాగే ఈ ప్రాంతంలో అనుబంధం ఉన్న వ్యాపారులు, పెట్టుబడిదారులకు వివరించి వారి పెట్టుబడులు ఇక్కడ పెట్టేలా చేసే ప్రయత్నం కలెక్టర్‌ రాజాబాబు నేతృత్వంలో యంత్రాంగం చేపట్టింది. అందుకోసం ఈనెల 22న సాయంత్రం ఐదు గంటల నుంచి వ్యాపార ప్రముఖులతో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

స్వయంగా ఆహ్వానిస్తున్న అధికారులు

ఏడాదికి రూ.10కోట్ల నుంచి రూ.100కోట్ల టర్నోవర్‌తో నడుస్తున్న వ్యాపార, పారిశ్రామిక వేత్తలను స్వయంగా సంబంధిత అధికారులు కలిసి ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. సుమారు 400 మంది ఈ ముఖాముఖికి హాజరుకావచ్చని అధికారవర్గాల సమాచారం. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న వనరులు, ప్రభుత్వ విధానాలు, జిల్లాకు వస్తున్న భారీ ప్రాజెక్టులు, వీటన్నింటి ఆధారంగా పెట్టుబడులు, వ్యాపారాలకు ఉన్న అవకాశాలపై కలెక్టర్‌ ఇతర అధికారులు వారికి వివరించనున్నారు. ఇందుకోసం ప్రైవేటు కన్సల్టెన్సీ ద్వారా ఒక నివేదికను కూడా సిద్ధం చేస్తున్నారు. కాగా బిజినెస్‌ ఎలైట్‌ మీట్‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారీగానే ఖర్చు కూడా కానుండటంతో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ల నుంచి ఆ మేరకు యంత్రాంగం సహకారం పొందుతున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.

Updated Date - Jun 18 , 2026 | 03:06 AM