కలెక్టర్ విస్తృత పర్యటన
ABN , Publish Date - May 15 , 2026 | 01:29 AM
జిల్లా కేంద్రంలో గురువారం కలెక్టర్ విజయ సునీత విస్తృతంగా పర్యటన చేశారు. ఉదయం 6.00 గంటల నుంచి 9.00 గంటల వరకు పలు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ముందుగా వేకువజామున స్థానిక గడియార స్తంభం సమీపంలో పారిశుధ్య పనులను పరిశీలించారు.
పారిశుధ్యం, డంపింగ్, మార్కెట్ యార్డ్ పరిశీలన
జనగణనపై ఆరా
మార్కాపురం టౌన్, మే 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలో గురువారం కలెక్టర్ విజయ సునీత విస్తృతంగా పర్యటన చేశారు. ఉదయం 6.00 గంటల నుంచి 9.00 గంటల వరకు పలు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ముందుగా వేకువజామున స్థానిక గడియార స్తంభం సమీపంలో పారిశుధ్య పనులను పరిశీలించారు. అంతేగాక ఆ ప్రాంతంలో పగటి స మయంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నందున క్రమబద్ధీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రాజ్యలక్ష్మి కాలనీకి వెళ్లి జనగణన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గృహ యజమానులకు పలు సూచనలు చేశారు. ఇళ్ల వద్దకు వ చ్చే ఎన్యుమరేటర్‌లకు కచ్ఛితమైన సమాచారం అందించాలన్నారు. జనగణనను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎన్యుమరేటర్‌లు, పర్యవేక్షకులకు సూచించారు. అనంతరం సెవెన్‌హిల్స్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ పరిసరాలను పరిశీలించి పట్టణాన్ని ప్రతిబింబించే నిర్మాణాన్ని ఒకటి అక్కడ చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయ మర్కెట్ యార్డ్ సమీపంలోని డంపింగ్ యార్డ్‌కు వెళ్లి చెత్తను ప్రాసెస్ చేసే విధానాన్ని పరిశీలించారు. చెత్త నుంచి సంపదను సృష్టించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డుకు వెళ్లిన కలెక్టర్ రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. టిడ్కో గృహాల నిర్మాణాలను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ బ స్టాండ్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. అక్కడ పరిశుభ్రత, నాణ్యతవంటి అంశాలను కలెక్టర్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డీవీఎస్ నారాయణరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ చెన్నకేశవులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.