Share News

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

ABN , Publish Date - May 07 , 2026 | 02:31 AM

ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలు, ప్రజల సంక్షేమం, భవిష్యత్‌ లక్ష్యాలపై సమీక్ష కోసం గురు, శుక్రవారాల్లో రెండు రోజులపాటు రాష్ట్రప్రభుత్వం కలెక్టర్ల సదస్సును నిర్వహిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావస్తుండగా కలెక్టర్ల సదస్సు నిర్వహించడం ఇది ఏడోసారి.

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

కీలక అంశాలపై నివేదికలతో వెళ్తున్న రాజాబాబు

శాంతిభద్రతలపై సమీక్షకు హాజరుకానున్న ఎస్పీ

ఒంగోలు, మే 6 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలు, ప్రజల సంక్షేమం, భవిష్యత్‌ లక్ష్యాలపై సమీక్ష కోసం గురు, శుక్రవారాల్లో రెండు రోజులపాటు రాష్ట్రప్రభుత్వం కలెక్టర్ల సదస్సును నిర్వహిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావస్తుండగా కలెక్టర్ల సదస్సు నిర్వహించడం ఇది ఏడోసారి. కలెక్టర్‌ రాజాబాబు మూడోసారి హాజరవుతున్నారు. రెండు రోజులపాటు నిర్వహించే సదస్సులో చర్చించే అంశాలను వారంక్రితమే తెలియజేసి అవసరమైన నివేదికలను జిల్లాల నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారులు తీసుకున్నారు. వాటిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమీక్షించి తదుపరి చర్యలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈసారి సదస్సులో ప్రధానాం శంగా గతేడాది (2025-26) జిల్లాల వారీ స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, వాటి సాధన, కేంద్రప్రభుత్వ పఽథకాల పురోగతి, వాటిపై ప్రజలు సంతృప్తి స్థాయి, ప్రజా విజ్ఞప్తులు, వాటి పరిష్కారాలు, వివిధ రకాల పెట్టుబడుల ప్రతిపాదనలు, సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు, ఆరోగ్యం, భూసంబంధ సమస్యలు, పరిష్కారాలు, విద్య, ఉపాధి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, శాంతిభద్రతలు, కోర్టు కేసులు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై చర్చ సాగనుంది. ఆయా రంగాల వారీ గతేడాది సాధించిన పురోగతి, భవిష్యత్‌ లక్ష్యాల సాధనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా కలెక్టర్లతో సమీక్ష చేయనున్నారు. అజెండాలోని పలు అంశాలకు సంబంధించి జిల్లా నివేదికలతో ఈ సదస్సుకు కలెక్టర్‌ రాజాబాబు హాజరవుతున్నారు. ఇటీవల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయన పల్లె నిద్రలు చేస్తున్నారు. మరుసటి రోజు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆ కార్య క్రమ అనుభవాలు, వివిధ అంశాలకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న వినతులు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలతోపాటు జిల్లాకు సంబంధించిన ఇతర అంశాలపై కలెక్టర్‌ సదస్సులో

Updated Date - May 07 , 2026 | 02:31 AM