Share News

11న చినపవనిలో కలెక్టర్‌ పల్లెనిద్ర

ABN , Publish Date - Jun 10 , 2026 | 01:01 AM

నెలలో ఒక నియోజకవర్గంలో మీకోసం, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించా లన్న సీఎం ఆదేశాలతో ఈనెల 11వతేదీన లింగసముద్రం మండలం చినపవనిలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని కలెక్టర్‌ రాజాబాబు నిర్వహిస్తున్నారు.

11న చినపవనిలో కలెక్టర్‌ పల్లెనిద్ర

12న లింగసముద్రంలో ‘మీకోసం’

ఒంగోలు కలెక్టరేట్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి) : నెలలో ఒక నియోజకవర్గంలో మీకోసం, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించా లన్న సీఎం ఆదేశాలతో ఈనెల 11వతేదీన లింగసముద్రం మండలం చినపవనిలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని కలెక్టర్‌ రాజాబాబు నిర్వహిస్తున్నారు. గ్రామస్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. రాత్రికి అక్కడ బస చేసి శుక్రవారం ఉదయం గ్రామంలో పర్యటిస్తారు. 12వ తేదీ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లింగసముద్రం తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తామని కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Jun 10 , 2026 | 01:01 AM