జడ్పీ ప్రత్యేక అధికారికగా కలెక్టర్
ABN , Publish Date - Sep 26 , 2026 | 03:13 AM
జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజాబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి వచ్చిన ఆయనకు సీఈవో చిరంజీవి ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు.
బాధ్యతలు స్వీకరించిన రాజాబాబు
ఘనస్వాగతం పలికిన కార్యాలయ అధికారులు
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజాబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి వచ్చిన ఆయనకు సీఈవో చిరంజీవి ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ధ్యేయమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసా గేలా చర్యలు తీసుకుంటానన్నారు. జడ్పీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తాన న్నారు. త్వరలో జరగనున్న ఎన్నికలను సజావుగా నిర్వహించేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు. అనంతరం కార్యాలయ సిబ్బందిని పరిచయం చేసుకున్నారు.