Share News

సీఎం వెలిగొండ పర్యటన వాయిదా

ABN , Publish Date - Jan 04 , 2026 | 01:42 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెలిగొండ ప్రాజెక్టు పర్యటన వాయిదా పడింది. ఈమేరకు అధికారులకు సమాచారం అందింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సీఎం ఈనెల 7న వెలిగొండను సందర్శించాల్సి ఉంది.

సీఎం వెలిగొండ పర్యటన వాయిదా

తదుపరి తేదీని వెల్లడిస్తామన్న అధికారులు

మార్కాపురం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెలిగొండ ప్రాజెక్టు పర్యటన వాయిదా పడింది. ఈమేరకు అధికారులకు సమాచారం అందింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సీఎం ఈనెల 7న వెలిగొండను సందర్శించాల్సి ఉంది. ఈనేప థ్యంలో శనివారం కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌ బాబు, ఇతర అధికారులు వెలిగొండ ప్రాజెక్టు వద్ద కార్యక్రమ ఏర్పాట్ల పరిశీలనకు వెళ్లారు. దోర్నాల మండల పరిధిలోని గంటవానిపల్లి వద్ద హెలిప్యాడ్‌, సభా స్థలాన్ని పరిశీలించారు. మార్కాపురంలో కలెక్టర్‌ రాజాబాబు విలేకరుల సమావేశం నిర్వహించి కార్య క్రమ వివరాలను వెల్లడించారు. ఇంతలోనే సీఎం పర్యటన వాయిదా పడినట్లు సీఎంవో నుంచి సమా చారం అందింది. ఈ విషయాన్ని సబ్‌ కలెక్టర్‌ శివరా మిరెడ్డి విలేకరులకు వెల్లడించారు. తదుపరి ఎప్పుడు ఉంటుందనేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

Updated Date - Jan 04 , 2026 | 01:42 AM