Share News

27న సీఎం పర్యటన

ABN , Publish Date - Jun 23 , 2026 | 01:03 AM

గిద్దలూరు మండలం కేఎ్‌సపల్లె గ్రామంలో ఈనెల 27వ తేదీ జరుగనున్న ముఖ్యమంత్రి పర్యటనను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ పెందుర్తి వెంకటేష్‌, కలెక్టర్‌ విజయసునీత, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, ఎమ్మెల్యే మత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.

27న సీఎం పర్యటన
సీఎం పర్యటనకు సంబంధించి పీహెచ్‌సీ పరిసరాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయసునీత, ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, అధికారులు

గిద్దలూరు మండలం కేఎస్‌పల్లిలో పకడ్బందీ ఏర్పాట్లు

అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలి

సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌, కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే ఆదేశం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సభాస్థలి, హెలిప్యాడ్‌ పరిశీలన

గిద్దలూరు టౌన్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) : గిద్దలూరు మండలం కేఎ్‌సపల్లె గ్రామంలో ఈనెల 27వ తేదీ జరుగనున్న ముఖ్యమంత్రి పర్యటనను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ పెందుర్తి వెంకటేష్‌, కలెక్టర్‌ విజయసునీత, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, ఎమ్మెల్యే మత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం కేఎ్‌సపల్లెలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను వారు పరిశీలించారు. సభావేదిక నిర్మాణం, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు, పార్కింగ్‌, తాగునీటి వసతి, విద్యుత్‌ సరఫరా, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రత అంశాలను చూశారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ విజయసునీత, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు సీఎం పర్యటన విజయవంతం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సభాప్రాంగణంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల రాకపోకలకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతోపాటు భద్రత ప్రమాణాలను పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. ఏర్పాట్ల పురోగతిపై ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పులి శ్రీనివాసులు, ఆర్డీవో ఎం.వెంకట శివరామిరెడ్డి, డీఎస్పీ యు.నాగరాజు, తహసీల్దార్‌ ఆంజనేయరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 01:03 AM