రెండున్నరేళ్లలో రూ.18.83 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ABN , Publish Date - Oct 06 , 2026 | 10:57 PM
ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రూ.18.83 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను 2,450 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశానని ఎమ్మెల్యే విజయ్‌కుమార్ చెప్పారు.
మెగా కార్యక్రమంలో ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్
ఒక్కరోజే 504 మందికి రూ.3.60 కోట్ల విలువైన చెక్కుల అందజేత
స్థానిక ఎన్నికలలో ప్రతిచోటా విజయఢంకా మోగించాలి
ఒంగోలు రూరల్, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి) : ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రూ.18.83 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను 2,450 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశానని ఎమ్మెల్యే విజయ్‌కుమార్ చెప్పారు. ఒంగోలు నగర నార్త్ బైపా్‌సరోడ్డులోని బృందావన ఫంక్షన్ హాలులో మంగళవారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకేరోజు రూ.3 కోట్ల 6లక్షల విలువైన సీఎంఎ్‌పఆర్‌ఎఫ్ చెక్కులను 504 మంది పేదలకు అందజేసి అండగా ఉన్నట్లు తెలిపారు. ఈ తరహా చెక్కుల పంపిణీతోనే మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయన్నారు. సీఎంఆర్‌ఎఫ్ అందచేయటం మానవత్వంతో కూడుకున్న సేవ అని చెప్పారు. ఇటు అభివృద్ధి, అటు సంక్షేమం రెంటికీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీటి సౌకర్యం కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఆ దిశగా నిధులు కేటాయించి రైతుల శ్రేయస్సు కోసం పని చేస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికలలో వచ్చిన మెజార్టీని ఎన్నటికీ మరువలేనన్నారు. నిరంతరం ప్రజలలో ఉండి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గుండ్లకమ్మ రిజర్వాయర్ గేట్లు.. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాకే నూతనంగా నిర్మించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోటా గెలవాలని నేతలకు చెప్పారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ నాయకులు అడపా స్వాములు, పొగాకు సమాఖ్య అధ్యక్షుడు మండవ జయంత్‌బాబు, ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాదు, నాయకులు గొట్టిపాటి రాఘవరావు, ఎన్‌ఆర్‌ఐ తక్కెల్లపాటి రమేష్, గొల్లపూడి సుబ్బారావు, పోతినేని శ్రీనివాసరావు, తేళ్ల మనోజ్‌కుమార్, కాకర్ల లక్ష్మివర ప్రసాదు, నన్నూరి శ్రీనివాసరావు, ఉప్పగుండూరి నాగేశ్వరరావు, మద్దినేని హరిబాబు, జనసేన నాయకుడు కుందుకూరి బాబు పాల్గొన్నారు.