బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:19 PM
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం పట్టణానికి చెందిన షేక్ మున్నీకి అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మంజూరు చేయించిన రూ.58,713ల ఎల్‌ఓసీని బాధితునికి టీడీపీ నాయకులు అందచేశారు.
మార్టూరు, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం పట్టణానికి చెందిన షేక్ మున్నీకి అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మంజూరు చేయించిన రూ.58,713ల ఎల్‌ఓసీని బాధితునికి టీడీపీ నాయకులు అందచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టిపాటి వెంకట్రావు, భుక్యా సూర్యనాయక్, మందపాటి అంజయ్య, గన్నవరం బుడే, కోటా మస్తానవలి, కెఎ్‌సఆర్, ముల్లా మస్తానవలి, కాశయ్య పాల్గొన్నారు. అదేవిధంగా యద్దనపూడి మండలంలోని పూనూరు గ్రామంలో పఠాన్ నజిరున్‌కు అత్యవసర చికిత్స నిమిత్తం మంజూరైన రూ.1,05,838ల ఎల్‌ఓసీని టీడీపీ నాయకులు అందచేశారు. ఈ కార్యక్రమంలో బోయపాటి సాంబయ్య, ఈదల అనిల్‌కుమార్, గన్నమనేని ప్రభాకరరావు, మన్నం వెంకటేశ్వర్లు, బోయపాటి వెంకట్రావు పాల్గొన్నారు. అలాగే జాగర్లమూడి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న షేక్ మాలిన్‌కు అత్యవసర చికిత్సకు రూ.2,46,288 సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరుకాగా, అందుకు సంబంధించిన ఎల్‌ఓసీని బాధితునికి గ్రామ నాయకులు దూళిపాళ్ల వెంకటస్వామి అందజేశారు.