Share News

27న వెలిగొండకు సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:20 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 27న దోర్నాల మండలం గంటవాని పల్లెకు వస్తున్నారు. అక్కడ వెలిగొండ ఫీడర్‌ కెనాల్‌ పనుల పురోగతిని పరిశీలించను న్నారు. అనంతరం సభలో పాల్గొని ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం చెక్కులను అందజేయనున్నారు.

27న వెలిగొండకు సీఎం చంద్రబాబు
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయసునీత, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

గంటవానిపల్లి వద్ద ఫీడర్‌ కెనాల్‌ పరిశీలన

అక్కడే సభ, నిర్వాసితులకు చెక్కుల పంపిణీ

ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్‌, ఎస్పీ సూచనలు

పెద్దదోర్నాల, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 27న దోర్నాల మండలం గంటవాని పల్లెకు వస్తున్నారు. అక్కడ వెలిగొండ ఫీడర్‌ కెనాల్‌ పనుల పురోగతిని పరిశీలించను న్నారు. అనంతరం సభలో పాల్గొని ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం చెక్కులను అందజేయనున్నారు. ఈమేరకు ఆయన పర్యటన ఖరారైంది. దీంతో అధికారులు ఏర్పాట్లను ప్రారంభించారు. వాటిని బుధవారం కలెక్టర్‌ విజయసునీత, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జేసీ పులి శ్రీనివాసులు, టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారులు పరిశీలించారు. హెలిప్యాడ్‌ ప్రాంతం, వాహనాల పార్కింగ్‌, సభా ప్రాంగణం పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా చూశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విజయసునీత విలేకరులతో మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు కేటాయించిన రూ.905.56కోట్లలో మొదటి విడత రూ.300కోట్ల పరిహారం చెక్కులను అందజేసేందుకు సీఎం చంద్రబాబు ప్రాజెక్టు వద్దకు వస్తున్నారని చెప్పారు. ఇప్పటికే రూ.80కోట్లు చెల్లించామని చెప్పారు. ఫీడర్‌ కెనాల్‌ పనులను కూడా సీఎం పరిశీలిస్తారన్నారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ సీఎం పర్యటనకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఎస్‌ఈ అబూతలీమ్‌, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐలు అజయ్‌కుమార్‌, హసన్‌, ఎ్‌సబీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, ఇంజనీరింగ్‌ అధికారులు, తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీవో ప్రసూనదేవి, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 03:20 AM