ప్రజా చైనత్యంతోనే పరిశుభ్రత
ABN , Publish Date - Jul 19 , 2026 | 02:47 AM
ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రజలంతా చైతన్యవంతంతో పరిశుభ్రత పాటించాలని పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం శనివారం జిల్లావ్యాప్తంగా జరిగింది.
స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్రలో నేతల పిలుపు
జిల్లావ్యాప్తంగా సాగిన కార్యక్రమం
దర్శి మండలంలో పాల్గొన్న మంత్రి స్వామి
పలుచోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు
ఒంగోలు, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రజలంతా చైతన్యవంతంతో పరిశుభ్రత పాటించాలని పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం శనివారం జిల్లావ్యాప్తంగా జరిగింది. దర్శి మండలం తూర్పుచౌటపాలెంలో మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి పాల్గొన్నారు. టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ స్వామి రూ.50 లక్షల విలువైన ఐదు ట్రాక్టర్లు, 25 చెత్తసేకరణ వాహనాలను పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికులను సత్కరించడంతోపాటు ప్రజల చేత పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. వీవీపాలెం మండలం శమీరాపాలెంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు భాగస్వాములయ్యారు. ఒంగోలులోని 19వ డివిజన్‌లోని బీకే ఎన్‌క్లేవ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏఎస్పీలు ఎన్.యుగంధర్, ఎన్.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. పలు ఇతర ప్రాంతాల్లో అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.