పరిశుభ్రతే లక్ష్యం
ABN , Publish Date - Apr 30 , 2026 | 02:50 AM
గ్రామీణ ప్రాంతా ల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం వినూత్నరీతిలో కార్యక్రమాలను చేపడుతోంది. ఇప్పటివరకు అంతర్గత పారిశుధ్య నిర్వహణను ఎక్కు వగా పట్టించుకోగా ఇప్పుడు ప్రతి బుధవారం మండల కేంద్రాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల కనెక్టవిటీ ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించింది.
ఇక నుంచి ప్రతి బుధవారం స్వచ్ఛపథం కార్యక్రమం
వినూత్నరీతిలో చేపట్టాలని ప్రభుత్వ ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతా ల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం వినూత్నరీతిలో కార్యక్రమాలను చేపడుతోంది. ఇప్పటివరకు అంతర్గత పారిశుధ్య నిర్వహణను ఎక్కు వగా పట్టించుకోగా ఇప్పుడు ప్రతి బుధవారం మండల కేంద్రాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల కనెక్టవిటీ ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం గ్రామం, మండల కేంద్రాల్లోని చెత్తను ఊరిబయట నిల్వ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అటువంటి చెత్తపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. అందులోభాగంగా ప్రతి బుధవారం స్వచ్ఛపఽథం కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించింది. తదనుగుణంగా జిల్లావ్యాప్తంగా బుధవారం స్వచ్ఛపఽథం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులోభాగంగా గ్రామం బయట పేరుకుపోయిన చెత్తను తొలగించడంతోపాటు శుభ్రం చేసేలా చర్యలు తీసుకున్నారు. ఆ గ్రామంలో చెత్త ఎత్తేందుకు అవసరమైన పారిశుద్య సిబ్బంది లేకపోతే సమీప పంచాయతీల్లోని కార్మికులను అక్కడికి రప్పించి వారితో శుభ్రంచేసే ప్రక్రియను అమలు చేస్తున్నారు. తద్వారా ఒక గ్రామం నుంచి మరో గ్రామం, మండలకేంద్రం నుంచి మరొక గ్రామానికి కనెక్టవిటీ ఉన్న ప్రాంతాలపై పంచాయతీ అధికారులు ఫోకస్ పెట్టారు. చెత్త తొలగించడమే కాకుండా ప్రజలకు కూడా పరిశుభ్రతపై అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. అందుకోసం ప్రభుత్వం ఒక ఆడియోలో పాట రూపొందించి ఆ గ్రామంలో విస్తృతంగా ప్రచారం ప్రారంభించారు. చెత్తతో కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ ర్యాలీలు కూడా చేపడుతున్నారు. అందులోభాగంగా బుధవారం మండలకేంద్రమైన సింగరాయకొండ, మూలగుంటపాడు గ్రామ పంచాయతీల్లో ఒంగోలు డివిజనల్ పంచాయతీ అధికారి ఆర్.పద్మ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు, డీప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులను భాగస్వామ్యులను చేశారు.