Share News

ఉద్యమంలా స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర

ABN , Publish Date - Sep 20 , 2026 | 03:01 AM

స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం మార్కాపురం జిల్లాలో శనివారం ఉద్యమంలా సాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కనిగిరి ప్రభుత్వాసుపత్రి వద్ద జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి హాజరయ్యారు.

ఉద్యమంలా స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర
కనిగిరి ప్రభుత్వాసుపత్రిలో వ్యర్థాలను తొలగిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

మార్కాపురం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం మార్కాపురం జిల్లాలో శనివారం ఉద్యమంలా సాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కనిగిరి ప్రభుత్వాసుపత్రి వద్ద జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి హాజరయ్యారు. వైద్యశాల పరిసరాలను కూటమి నాయకులతో కలిసి ఆయన శుభ్రం చేశారు. మార్కాపురంలోని ఆయేషా మసీదు ప్రాంతంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులతో కలిసి వీధులను శుభ్రపరిచారు. గిద్దలూరులో మునిసిపల్‌ అధికారులు, సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు. జిల్లాలోని పలుప్రాంతాల్లో అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 03:01 AM