Share News

శ్రీశైలంలో చీరాల కానిస్టేబుల్‌ మృతి

ABN , Publish Date - Mar 25 , 2026 | 10:55 PM

శ్రీశైలం ఆనకట్ట వద్ద విధుల్లో ఉన్న ఎస్పీఎ్‌ఫ(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌) కానిస్టేబుల్‌ పిల్లి వీరాస్వామీ(52) తేనెటీగల దాడిలో మృతి చెందారు.

శ్రీశైలంలో చీరాల కానిస్టేబుల్‌ మృతి

తేనె టీగల దాడితో ఘటన

ఉజిలీపేట(చీరాల), మార్చి25 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం ఆనకట్ట వద్ద విధుల్లో ఉన్న ఎస్పీఎ్‌ఫ(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌) కానిస్టేబుల్‌ పిల్లి వీరాస్వామీ(52) తేనెటీగల దాడిలో మృతి చెందారు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో విధులకు హాజరైన వీరాస్వామిపై విషపు తేనెటీగలు ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేశాయి. తప్పించుకునే క్రమంలో పరుగులంకించి గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డారు. మృతుని స్వగ్రామం చీరాల ఉజిలీపేట. భార్య, ఎంబీబీఎస్‌ చదువుతున్న కుమారుడు సంతానం. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్దసంఖ్యలో శ్రీశైలం తరలివెళ్లి బుధవారం రాత్రికి స్వగ్రామానికి మృతదేహాన్ని చేర్చారు. గురువారం ఉదయం చీరాల్లో అంత్యక్రియలు జరుగనున్నాయి.

Updated Date - Mar 25 , 2026 | 10:55 PM