ప్రైవేటు ఫైనాన్స్‌లకు టోకరా
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:40 AM
రిజిస్ట్రేషన్ శాఖను బోల్తాకొ ట్టించి ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలకు రూ.6కోట్ల మేర టోకరా వేసిన ఘనుడు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. రాష్ట్రం లో విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, ఒంగోలులో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలను తన తెలివితేటలతో బోల్తా కొట్టించాడు. అందుకు సంబం ధించి ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యా యి.
రూ.6కోట్ల రుణాలు గోల్‌మాల్
రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో కేసులు
రిజిస్ట్రేషన్ శాఖకు నకిలీ అఫిడవిట్
ఒకరు అరెస్టు, పరారీలో ముగ్గురు
ఒంగోలు క్రైం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్ శాఖను బోల్తాకొ ట్టించి ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలకు రూ.6కోట్ల మేర టోకరా వేసిన ఘనుడు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. రాష్ట్రం లో విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, ఒంగోలులో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలను తన తెలివితేటలతో బోల్తా కొట్టించాడు. అందుకు సంబం ధించి ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యా యి. అయితే ఎక్కడా మోసగాడిని అరెస్టు చేసిన దాఖలాలు లేవు. గతేడాది నవంబరులో ఒంగోలులో నమోదైన కేసులో ఈ కేటుగాడి తల్లిని ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఒంగోలు హౌసింగ్ బోర్డులో ఉన్న ఇంటిని వరదా సుధాచైతన్యబాబు ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో 2023లో తాకట్టు పెట్టి రూ.53.40 లక్షలు తీసుకున్నాడు. అందుకు ఇంటిని రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో మార్ట్‌గేజీ చేయించాడు. మూడు నెలలు తిరగకుండా 2023 నవంబరు 18న ఫైనాన్స్ కంపెనీ అసిస్టెంట్ మేనేజరంటూ ఒక వ్యక్తిని ఒంగోలు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం దగ్గరకు చైతన్యబాబు వెంట పెట్టుకెళ్లాడు. ఫైనాన్స్ కంపెనీలో తీసుకున్న రుణం మొత్తం చెల్లించినట్లు అతనితో చెప్పించి నకిలీ రశీదులు దాఖలు చేశారు. అందుకు సంబంధించి చైతన్యబాబు తల్లి, భార్యలను సాక్షులుగా పెట్టి అఫిడవిట్‌ను రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దాఖలు చేశాడు. దీంతో తాకట్టులో ఉన్న ఇల్లు మార్ట్‌గేజీని తొలగించి ఎన్‌వోసీని రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఇచ్చారు. అయితే ఫైనాన్స్ కంపెనీ వారికి నెలవారీ ఈఎంఐలు చెల్లించకపోవడంతో కంపెనీ నిజమైన అసిస్టెంట్ మేనేజర్ గోవిందరాజులు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయానికి వెళ్లి పరిశీలించి అవాక్కయ్యాడు. తమ కంపెనీకి చెందిన రశీదులు కాదని అధికారులతో తెలియజేసి అందుకు సంబంధించి ఒంగోలు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో 2024 నవబరు 30న ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు చైతన్యబాబు తల్లి అంజనదేవిని శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు. చైతన్యబాబుపై ఇలాంటి కేసులు రాష్ట్రంలో పలుచోట్ల ఉన్నట్లు, దాదాపు రూ.6కోట్ల మేర టోకరా వేసినట్లు తెలిపారు. అయితే ప్రధాన నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు.