Share News

దళారీ వ్యవస్థకు చెక్‌

ABN , Publish Date - May 13 , 2026 | 03:13 AM

రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దళారీ వ్యవస్థకు చెక్‌పెట్టి వాహనదారులకు ఇబ్బందిలేకుండా చర్యలు చేపట్టింది. కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల్లో రిజిస్ట్రేష న్‌ పూర్తయ్యేలా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

దళారీ వ్యవస్థకు చెక్‌
ఒంగోలులోని ఉపరవాణా కమిషనర్‌ కార్యాలయం

రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు

24 గంటల్లో వాహనాల రిజిస్ట్రేషన్‌

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అయిన వెంటనే అమలు

ఒంగోలుక్రైం, మే 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దళారీ వ్యవస్థకు చెక్‌పెట్టి వాహనదారులకు ఇబ్బందిలేకుండా చర్యలు చేపట్టింది. కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల్లో రిజిస్ట్రేష న్‌ పూర్తయ్యేలా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాహనం కొనుగోలు చేసిన వారు నేరుగా డీలర్‌ ద్వారా దరఖా స్తు చేస్తే రవాణా శాఖ ఎలాంటి అభ్యంతరం, ఆమోదం తెలప కపోయినా ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్‌ అయిపోతుంది. అయితే ప్రస్తుతం వాహన్‌ పోర్టల్‌లో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అయిన వెంటనే ఈ మార్పులు జరిగిపోతాయి. సెలవు రోజులలో కూడా ఈ ప్రక్రియ కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రవాణా శాఖలో ఎలాంటి అవినీతికి తావులేకుండా నేరుగా డీలర్‌ నుంచే వాహనదారుడు రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసుకోవచ్చు.

24 గంటలలో నంబర్‌ వస్తుంది

నూతన వాహనం కొనుగోలు చేసిన 24 గంటలలో రిజిస్ట్రేషను పూర్తి అయి నంబరు కూడా వస్తుంది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఈనెల 12న ఉత్తర్వులు జారీచేసింది. అయితే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసే పనులలో జాప్యం జరగవచ్చని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. వాహనం కొనుగోలు చేసిన తర్వాత డీలర్‌ వద్ద ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ సమర్పించిన తర్వాత 24 గంటలలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్‌ నంబర్‌ కూడా వస్తుంది. ఒకవేళ రవాణాశాఖ అధికారులు 24గంటలలో దరఖాస్తును ఆమోదించకపోయినా ఆటోమోటిక్‌గా అప్రూవల్‌ పొందుతుంది.

సెలవు రోజులలో సేవలు

ఆదివారం లేదా ప్రభుత్వ సెలవు రోజులలో కూడా ఆన్‌లైన్‌ విధానంలో ఈ ఆమోద ప్రక్రియ కొనసాగుతుంది. దీనికోసం అవసరమైన సాంకేతిక సదుపాయాలను రవాణాశాఖ సిద్ధం చేస్తోంది. దీంతో రవాణా శాఖ చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకునే అవకాశం ఉంది.

ఎవరి ప్రమేయం అవసరం లేదు

వాహనాల రిజిస్ట్రేషన్‌లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సులభతరం చేశారు. రవాణాశాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా చర్యలు తీసుకున్నారు. రవాణాశాఖ అధికారులు సెలవు రోజులలో కూడా ఆమోదం తెలిపే విధంగా మార్పులు చేశారు.

Updated Date - May 13 , 2026 | 03:13 AM