చాపలమడుగు పంచాయతీ కార్యదర్శిపై వేటు
ABN , Publish Date - Feb 28 , 2026 | 01:48 AM
పుల్లలచెరువు మండలం చాపలమడుగు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీకి విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.12.75 లక్షలను దుర్వినియోగం చేయడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు.
సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
సర్పంచ్‌కు షోకాజ్ నోటీసు జారీ
ఒంగోలు కలెక్టరేట్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : పుల్లలచెరువు మండలం చాపలమడుగు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీకి విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.12.75 లక్షలను దుర్వినియోగం చేయడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. సర్పంచ్ సత్యనారాయణరెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పంచాయతీల్లో వినియోగించాల్సి ఉంది. అయితే చాపలమడుగు పంచాయతీలో నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక సంఘం నిధులను డ్రా చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావుకు ఫిర్యాదులు వచ్చాయి. ఆయన విచారణ చేయించగా నిధులను నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేసినట్లు తేలింది. ఈమేరకు కలెక్టర్‌కు నివేదిక ఇవ్వడంతో ఆయన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశారు.