Share News

వైజ్ఞానిక ప్రదర్శన షెడ్యూల్‌లో మార్పులు

ABN , Publish Date - Nov 26 , 2026 | 02:37 AM

వైజ్ఞానిక ప్రదర్శ నల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. తొలుత ప్రకటించిన ప్రకారం ఈనెల 28 నుంచి 30వ తేదీలోపు జిల్లాస్థాయి ప్రదర్శనను పూర్తిచే యాల్సి ఉంది. అయితే పంచాయతీ పోరు నేపథ్యంలో ఉపాధ్యా యులు, హెచ్‌ఎంలు ఎన్నికల విధుల్లో ఉన్న విషయాన్ని వివిధ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో షెడ్యూ ల్‌లో మార్పులకు అవకాశం ఇచ్చింది.

వైజ్ఞానిక ప్రదర్శన షెడ్యూల్‌లో మార్పులు

జిల్లాలో వచ్చేనెల 4, 7, 8 తేదీల్లో నిర్వహణ

ఒంగోలు విద్య, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : వైజ్ఞానిక ప్రదర్శ నల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. తొలుత ప్రకటించిన ప్రకారం ఈనెల 28 నుంచి 30వ తేదీలోపు జిల్లాస్థాయి ప్రదర్శనను పూర్తిచే యాల్సి ఉంది. అయితే పంచాయతీ పోరు నేపథ్యంలో ఉపాధ్యా యులు, హెచ్‌ఎంలు ఎన్నికల విధుల్లో ఉన్న విషయాన్ని వివిధ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో షెడ్యూ ల్‌లో మార్పులకు అవకాశం ఇచ్చింది. డిసెంబరు 9లోపు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను పూర్తిచేసేందుకు వెసులుబాటు కల్పిం చింది. దీంతో జిల్లా విద్యాశాఖ డిసెంబరు 4న పాఠశాల స్థాయి, 7న మండల స్థాయి, 8న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు షెడ్యూ ల్‌ను ప్రకటించింది. మండల స్థాయి ప్రదర్శనలో ప్రతి మండలం నుంచి నాలుగు ప్రాజెక్టులను జిల్లాస్థాయికి ఎంపిక చేయాల్సి ఉంటుది. జిల్లా స్థాయి ప్రదర్శనలో రెండు గ్రూపు ప్రాజెక్టులు, ఒక విద్యార్థి వ్యక్తిగత ప్రాజెక్టు, ఒక ఉపాధ్యాయ ప్రాజెక్టును ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు పంపాలి.

Updated Date - Nov 26 , 2026 | 02:37 AM