పాఠశాల విద్యాశాఖ పోస్టుల్లో మార్పులు
ABN , Publish Date - Jul 11 , 2026 | 02:57 AM
రాష్ట్రంలో జిల్లాల పున ర్విభజన (2022)కు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో కొత్త, పాత జిల్లాలకు అధికారులు, సిబ్బంది విభజనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 26 జిల్లాలకు దామాషా ప్రాతిపదికన అఽధికారులు, సిబ్బం దిని కేటాయించేందుకు ఉత్తర్వులు జారీచేసింది.
సీనియర్ అసిస్టెంట్ స్థాయి పెంపు
ఉమ్మడి జిల్లాకేంద్రానికి ఏసీ పోస్టు
ఒంగోలు విద్య, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో జిల్లాల పున ర్విభజన (2022)కు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో కొత్త, పాత జిల్లాలకు అధికారులు, సిబ్బంది విభజనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 26 జిల్లాలకు దామాషా ప్రాతిపదికన అఽధికారులు, సిబ్బం దిని కేటాయించేందుకు ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రకారం 26 జిల్లాలను ఆరు జోన్లుగా, రెండు మల్టీ జోన్లుగా విభజించారు. దీంతో పోస్టులను కూడా జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయిగా విభజించారు. పాఠశాల విద్యాశాఖలో పోస్టుల స్థాయిలో మార్పులు చేశారు. ప్రస్తుతం జిల్లాస్థాయి పోస్టుగా ఉన్న సీనియర్ అసిస్టెంట్‌ను జోనల్ స్థాయికి మార్చారు. దీంతో ఇక నుంచి సీనియర్ అసిస్టెంట్ల నియామకాలు, ఉద్యోగోన్నతులు, బదిలీలన్నీ జోనల్ స్థాయిలోనే జరగాలి. జోనల్ స్థాయి ఉన్న సూపరింటెండెంట్ పోస్టులను యథాయథంగా జోనల్ పోస్టులుగానే కొనసాగిస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్ స్థాయికి దిగువన ఉన్న వాటన్నింటినీ జిల్లాస్థాయి పోస్టులుగా, ఇప్పటివరకు రాష్ట్రస్థాయి పోస్టులుగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులను మల్టీ జోన్ పోస్టులుగా గుర్తించారు.
ఉమ్మడి జిల్లా కేంద్రానికి ఏసీ పోస్టు
ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ (ఏసీజీఈ) పోస్టును ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022లో జరిగిన సిబ్బంది, అధికారుల విభజనలో కూడా ఏసీ పోస్టును పూర్వ జిల్లాకేంద్రంలోనే కొనసాగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా అధికారులు చేతివాటం ప్రదర్శించి ఒంగోలులో ఉండాల్సిన ఏసీ పోస్టును బాపట్లకు తరలించారు. ఓపెన్ స్కూలు జిల్లా కోఆర్డినేటర్ పోస్టును విభజిత జిల్లాకు కేటాయించాల్సి ఉండగా అధికారులు తిరకాసు చేసి దానిని ఏపీఓఎన్‌ఎస్ జిల్లా కోఆర్డినేటర్‌ను ఒంగోలుకు, ఏసీ పోస్టును బాపట్లకు కేటాయించారు. అయితే ప్రస్తుత విభజనలో ఆ పొరపాటును సరిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఒంగోలుకు ఏసీ పోస్టును కేటాయిస్తున్నట్లు అధికారులు వెబెక్స్ మీటింగ్‌ల్లో కూడా చెప్తున్నారు. దీంతో ఏపీఓఎస్‌ఎస్ జిల్లా కోఆర్డినేటర్ పోస్టు బాపట్లకు మార్చి ఓ గెజిటెడ్ హెచ్‌ఎంను ఆ పోస్టులో నియమించనున్నారు.
---------------------------------