Share News

మారిన ఎన్నికల షెడ్యూల్‌

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:29 AM

గ్రామ పంచాయతీ ఎన్నికలు తొలిదశ ఒంగోలు డివిజన్‌లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా మొదటి విడత ఎన్నిక లను కందుకూరు డివిజన్‌లోని పంచాయతీల్లో నిర్వహించాలని నిర్ణ యించారు.

మారిన ఎన్నికల షెడ్యూల్‌

మొదటి విడత ఒంగోలు డివిజన్‌

రెండో విడత అద్దంకి డివిజన్‌

కందుకూరు మునిసిపల్‌ ఎన్నికల

నేపథ్యంలో అక్కడ మూడో విడతకు మార్పు

515 పంచాయతీల్లో 10,59,248 మంది ఓటర్లు

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీ ఎన్నికలు తొలిదశ ఒంగోలు డివిజన్‌లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా మొదటి విడత ఎన్నిక లను కందుకూరు డివిజన్‌లోని పంచాయతీల్లో నిర్వహించాలని నిర్ణ యించారు. అయితే కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఆ డివిజన్‌లో ఎన్నికలను మూడో విడతకు మార్చారు. జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్‌ రాజాబాబు ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారి అనుపమ ఆ మేరకు చర్యలు చేపట్టారు. ఈనెల 13న ఒంగోలు డివిజన్‌లో మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీకానుంది. 26న పోలింగ్‌ జరగనుంది. 29న అద్దంకి డివిజన్‌లో, వచ్చేనెల 2న కందు కూరు డివిజన్‌లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 27 మండలాల పరిధిలో 515 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ పంచాయతీల్లో 10,59,248 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Updated Date - Nov 11 , 2026 | 01:29 AM