పేదరికంలేని సమాజ స్థాపనే చంద్రబాబు ధ్యేయం
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:09 AM
పేదరికం లేని సమాజ స్థాపనే సీఎం చంద్రబాబునాయుడు ధ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. సోమవారం సింగరాయకొండలో మండల టీడీపీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ వద్ద నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.
మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి
సీఎం జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి భోజనం
సింగరాయకొండ, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి) : పేదరికం లేని సమాజ స్థాపనే సీఎం చంద్రబాబునాయుడు ధ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. సోమవారం సింగరాయకొండలో మండల టీడీపీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ వద్ద నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. తొలుత నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జోడించి రాష్ట్రాన్ని పురోగతి బాటలో పయనింపజేస్తున్న దార్శినికుడు చంద్రబాబు అని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీకగా నిలిస్తే తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి చంద్రబాబుని చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనతో గాడితప్పిన రాష్ట్రాన్ని తన పాలన అనుభవంతో పునఃనిర్మించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని వివరించారు. సీఎం 76 పుట్టినరోజు సందర్బంగా రాష్ట్రంలో ఉన్న 269 అన్న క్యాంటీన్‌లో పేదలకు పూర్తి ఉచితంగా భోజనం అందించడానికి నారా భువనేశ్వరి రూ. 76 లక్షల విరాళం ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారని తెలిపారు. అనంతరం అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి భోజనం చేశారు. ఈ సమయంలో క్యాంటీన్ అందజేస్తున్న ఆహారం రుచిపై ఆరా తీశారు. కేవలం రూ. 5 నాణ్యమైన, రుచికరమైన భోజనం పెడుతున్నారని భోజనం చేస్తున్న పేదలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు మించల బ్రహ్మయ్య, నేతలు కూనపరెడ్డి సుబ్బారావు, చంటి, కృష్ణ, యస్థాని, గాలి హరాబాబు, సనావుల్లా పాల్గొన్నారు.