శ్మశానవాటిక అభివృద్ధి పనులు వేగవంతం
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:36 AM
మండల పరిధిలో బొబ్బేపల్లి గ్రామంలో హిందూ స్మశాన వాటికలో నిర్మాణ పనులు చురుకుగా సాగతున్నాయి.
మార్టూరు,మార్చి1(ఆంద్రజ్యోతి): మండల పరిధిలో బొబ్బేపల్లి గ్రామంలో హిందూ స్మశాన వాటికలో నిర్మాణ పనులు చురుకుగా సాగతున్నాయి. అందుకు సంబందించి దహనవాటిక, వేచిఉండే గది, స్నానపుగదులు, దుస్తులు మార్చుకోవడానికి గది, తదితర ఏర్పాట్లు కోసం భవన నిర్మాణ పనులు చేపడుతున్నారు. గ్రామంలో హిందూ శ్మశానవాటిక 90 సెంట్లు స్థలం విస్తీర్ణంలో ఉంది. దీనిలో అని వసతులు నిర్మాణం కోసం గ్రామస్థుల కోరిక మేరకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రూ.18 లక్షలు మంజూరు చేయించారు. ఈ నిధులతో పనులు వేగం పుంజుకున్నాయి. శ్మశానవాటిక చుట్టూ ప్రహరీగోడ, మెయిన్‌గేట్, గేట్‌పై ముఖద్వారం తదితర పనులు చేస్తున్నారు. గతంలో శ్మశానవాటిక వద్దకు వచ్చేవారు ముళ్లపొదలు, చెట్లుతో ఇబ్బందులు పడేవారు. వాటన్నింటిని శుభ్రం చేయించి, మంజూరైన నిధులతో శ్మశానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే గాకుండా శ్మాశానవాటికకు కొత్తగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించారు. ఇంకా నీటివసతి కూడా కల్పించారు. గ్రామ టీడీపీ నాయకులు తేలప్రోలు సాంబశివరావు, గుర్రం కోటేశ్వరరావు, మాలంపాటి మల్లయ్య, ఐలవరపు ఆంజనేయులు, గంగాధర సింగరకొండలు పనులను పర్యవేక్షిస్తున్నారు.