Share News

హైవేపై సిమెంట్‌ లారీ బోల్తా

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:04 PM

జాతీయ రహదారిపై మండలంలోని కోమటికుంట వద్ద సిమెంట్‌ లోడుతో వెళుతున్న లారీకి కారు అడ్డుగా రావడంతో ఢీకొట్టి బోల్తాపడింది. మహిళకు తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

హైవేపై సిమెంట్‌  లారీ బోల్తా
చెల్లాచెదురుగా పడిన సిమెంట్‌ బస్తాలు

అదుపుతప్పి కారును ఢీకొట్టిన వైనం

ఆ ప్రమాదంలో వాహనం ధ్వంసం

మహిళ పరిస్థితి విషమం.. ఇద్దరికి స్వల్ప గాయాలు

మార్కాపురం రూరల్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రహదారిపై మండలంలోని కోమటికుంట వద్ద సిమెంట్‌ లోడుతో వెళుతున్న లారీకి కారు అడ్డుగా రావడంతో ఢీకొట్టి బోల్తాపడింది. మహిళకు తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం... మార్కాపురం పట్టణం జవహర్‌నగర్‌ కాలనీకి చెందిన భార్యాభర్తలు జవ్వాజి వాణిశ్రీ, సుబ్రహ్మణ్యం కారులో మార్కాపురం వైపు వస్తున్నారు. అదే సమయంలో సిమెంట్‌ లోడుతో మాచర్ల నుంచి కర్ణాటక తుంకూరుకు కంబం వైపుగా వెళుతుంది. జాతీయ రహదారిపై వెళుతున్న కారు అడ్డంగా రావడంతో లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగంగా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న వాణిశ్రీకి తీవ్రగాయాలై విషమంగా ఉండడంతో స్థానిక జీజీహెచ్‌కు తరలించి వైద్యుల సూచన మేరకు గుంటూరు తరలించారు. సిమెంట్‌ లారీ డ్రైవర్‌ ఆంజనేయులుకు, కారులో ప్రయాణిస్తున్న సుబ్రహ్మణ్యంకు స్వల్ప గాయాలయ్యాయి. మార్కాపురం రూరల్‌ పోలీసులు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

Updated Date - Sep 06 , 2026 | 11:04 PM