నేడు సీసీఎల్‌ఏ కమిషనర్ రాక
ABN , Publish Date - Jul 16 , 2026 | 02:41 AM
రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) జయలక్ష్మి గురువారం మార్కాపురం వస్తున్నారు. రెవెన్యూ సమస్యలపై స్థానిక కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులకు సమాచారం అందింది.
మార్కాపురంలో రెవెన్యూ సమస్యలపై అధికారులతో సమీక్ష
మార్కాపురం, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) జయలక్ష్మి గురువారం మార్కాపురం వస్తున్నారు. రెవెన్యూ సమస్యలపై స్థానిక కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులకు సమాచారం అందింది. దీంతో కలెక్టర్ విజయసునీత జిల్లాలోని అందరు తహసీల్దార్‌లతో బుధవారం జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మండలాల్లో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యల్లో సాధ్యమైనన్ని పరిష్కరించాలని ఆదేశించినట్లు సమాచారం. జిల్లాలో రెవెన్యూపరంగా ముటేషన్‌లు, ఆన్‌లైన్, 22ఏ, పోర్టింగ్ తదితర అంశాలపై నివేదికలు సిద్ధం చేయాలని సూచించినట్లు తెలిసింది. రెవెన్యూపరంగా ఎక్కువ సమస్యలు ఉండటం, వాటిపై పదేపదే ఫిర్యాదులు రావడం, సీఎం చంద్రబాబు కూడా ఇక్కడ రెవెన్యూ సమస్యలను ఇటీవల ప్రస్తావించిన నేపథ్యంలో సీసీఎల్‌ఏ కమిషనర్ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పలువురు బాధితులు కూడా కమిషనర్‌ను కలిసి నేరుగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.