Share News

కారు బోల్తా.. వ్యక్తి మృతి

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:03 AM

అడవిపంది ఎదురుగా రావడంతో సడన్‌ బ్రేక్‌ వేయడంతో కారు బోల్తాపడి ఓ వ్యక్తి మృతిచెందగా మరో ముగ్గరు గాయపడ్డారు.

కారు బోల్తా.. వ్యక్తి మృతి

కురిచేడు, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి) : అడవిపంది ఎదురుగా రావడంతో సడన్‌ బ్రేక్‌ వేయడంతో కారు బోల్తాపడి ఓ వ్యక్తి మృతిచెందగా మరో ముగ్గరు గాయపడ్డారు. ఈ సంఘటన కురిచేడు మండలం పెద్దవరం గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఎంఎల్‌ నరసింహారావు తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం పెద్దవరంలో బంధువుల వివాహానికి హాజరయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున నరసింహారావు మరో ముగ్గురుతో కలసి కారులో హైదరాబాద్‌ బయలుదేరారు. గ్రామం దాటగానే కారుకు ఎదురుగా అడవి పంది రావడంతో సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో కారు పక్కనే ఉన్న వాగులోకి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు మృతిచెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్‌లో దర్శికి సీహెచ్‌సీ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు.

Updated Date - Apr 04 , 2026 | 12:03 AM