Share News

ఆటోను ఢీకొని కాలువలో కారు బోల్తా

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:13 AM

పర్చూరు నుంచి చిలకలూరిపేట వేరుశనగ విత్తనాల బస్తాల లోడుతో వెళుతున్న ఆటోను వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది.

ఆటోను ఢీకొని కాలువలో కారు బోల్తా

పర్చూరు, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : పర్చూరు నుంచి చిలకలూరిపేట వేరుశనగ విత్తనాల బస్తాల లోడుతో వెళుతున్న ఆటోను వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోయింది. కారుతో పాటు, ఆటో ఫల్టీ కొట్టి కాలువలో పడింది. ఈ ఘటన సోమ వారం పర్చూరు సబ్‌స్టేషన్‌ సమీపంలోని వాడరేవు - పిడుగురాళ్ల జాతీయ రహదారిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ తో పాటు, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. రోడ్డుపై వేరుశనగ బస్తాల్లోని విత్తనాలు చెల్లా చెదురుగా పడ్డాయి. సమాచారం అందుకున్న ఎస్సై పులి గోపి హుటాహుటిన ఘటనా స్ధలానికి చేరుకొని వివరాలు సేకరిం చారు. అయతే మద్యంసేవించి కారు నడపటం వల్లే ప్రమాదం చేసుచేసుకుందని స్థానికులు పేర్కొంటున్నారు.

ఆ రోడ్డులో తరచూ ప్రమాదాలు

నూతనంగా ఏర్పాటు చేసిన వాడరేవు - పిడుగురాళ్ల రహదారి లోని స్థానిక సబ్‌స్టేషన్‌ సమీపంలో తరచూ ప్రమాదాలు చోటుచేసు కుంటున్నాయి. దీంతో పలువురు ప్రాణాలను కోల్పోవడంతో వాహనదారులతోపాటు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రెండు రోజుల వ్యవధిలో గొర్రెలమందపై కారు దూసుకుపోయి 45 గొర్రెలు మృతి చెందటం, మరో ఘటనలో కారు అదుపుతప్పి డివైడర్‌ను డీకొని వ్యక్తి మృతి చెందాడు. గతంలో గ్రానైట్‌ లారీ తిరగబడి ముగ్గురు వ్యక్తులు రాళ్ల కింద పడి మృతిచెందారు. ఇలా తరచూ ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారుల స్పంధించి ప్రమాద మార్గాల్లో బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Mar 17 , 2026 | 12:14 AM